టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ స్టార్స్ తక్కువ. ఉన్నవారిలో అడవి శేష్ ముందుంటాడు. తనను తాను స్టార్ గా మలచుకున్నాడతను. మొదట కన్ఫ్యూజన్ లో విలన్ గా చేసినా తర్వాత రూట్ మార్చాడు. తనే కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ చేసిన క్షణం అతనిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా విజయవంతం అయింది. అటుపై వరుసగా తనే కథ, స్క్రీన్ ప్లే రాసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే అతనికి స్టార్డమ్ తెచ్చిన సినిమా గూఢచారి.
ఓ హాలీవుడ్ రేంజ్ స్పై థ్రిల్లర్ ను కేవలం ఐదు కోట్ల బడ్జెట్ లోనే చూపించాడు అతను. అదీ గొప్పదనం. రేసీ స్క్రీన్ ప్లే, హానెస్ట్ రైటప్ ఈ సినిమాకు ఆయువు పట్టు. అదే గూఢచారిని బ్లాక్ బస్టర్ చేశాయి. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు శేష్. ఈ లోగా తను బాగా బిజీ అయ్యాడు. వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతూ వస్తున్నాడు. మేజర్ తో దేశం మొత్తం తెలిసిపోయాడు. మేజర్ గా కంట్రీనీ మెస్మరైజ్ చేసి తన స్పాన్ మరింత పెంచుకున్నాడు. చివరగా చేసిన హిట్2 కూడా కమర్షియల్ గా హిట్ అయింది.
హిట్ 2 తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు శేష్. ఈ గ్యాప్ లోనే గూఢచారి 2 కథను ఫైనల్ చేసుకున్నాడు. మరో రచయిత అబ్బూరి రవి సాయంతో మరోసారి మంచి స్క్రీన్ ప్లే కూడా సెట్ అయిందంటున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ గా ట్వీట్ చేశాడు శేష్. ఇక గూఢచారి 2 షూటింగ్ ను అక్టోబర్ నుంచి ప్రారంభించబోతున్నారట.
ఈ సారి నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని చెబుతూ ట్వీట్ చేశాడు. అలాగే తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మళయాలంలోనూ విడుదల చేస్తా అని ప్రకటించాడు. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీతో కంట్రీ మొత్తం బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు శేష్.
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…
Man of masses NTR's birthday.. Only two more days left. He is acting as Young…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…