చాన్నాళ్ల తర్వాత ఒకే ఫ్రేములో గ్లోబల్ స్టార్స్

దశాబ్దాల తర్వాత తెలుగులో అసలు సిసలు మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టిన స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్. టాలీవుడ్ లో రైవల్రీ ఫ్యామిలీగా చెప్పుకునే ఈ స్టార్ హీరోలు ఇద్దరితోనూ ‘ఆర్.ఆర్.ఆర్’ తెరకెక్కించి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ టైమ్ లోనూ.. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అరెనాలోనూ గ్లోబల్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ కలిసి చేసిన ప్రచారం ఎప్పటికీ మరవలేం.’ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎవరి సినిమాల పనులతో వారు బిజీ అయిపోయారు. మళ్లీ లేటెస్ట్ గా ఈ గ్లోబల్ స్టార్స్ ఇద్దరూ ఒకే ఫ్రేములో కనిపించారు. ఒకవైపు బెంగళూరులో ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగే ఫంక్షన్ కు అటెండ్ అయ్యేందుకు ఎన్టీఆర్.. అంబానీల పెళ్లివేడుకలో పాల్గొనేందుకు జామ్ నగర్ బయలేదేరిన రామ్ చరణ్.. ఇద్దరూ ఒకే సమయంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకి వెళ్లారు. అక్కడ వీరిద్దరూ కలుసుకున్న వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Posts