లగడపాటి తనయుడితో నక్కిన త్రినాథరావు చిత్రం

‘ధమాకా‘ తర్వాత డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మాతగా బిజీ అయ్యారు. తన నక్కిన నేరేటివ్స్ బ్యానర్ పై వరుస సినిమాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈకోవలోనే నక్కిన త్రినాథరావు నిర్మాణంలో ప్రొడక్షన్ నెం.2 ముహూర్తాన్ని జరుపుకుంది. నక్కిన త్రినాథరావు కథ అందిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లగడపాటి శ్రీధర్ తనయుడు రాహుల్ సహిదేవ్ హీరోగా నటిస్తున్నాడు. ‘దృశ్యం‘ చిత్రంలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ ఈ మూవీలో హీరోయిన్.

ఈ చిత్రానికి వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఆంధ్రా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాలో తారక్ పొన్నప్ప మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి దావంద్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి హీరో సందీప్ కిషన్ క్లాప్ కొట్టగా.. శరత్ మరార్ కెమెరా స్విఛ్ఛాన్ చేశారు. హీరో సుమంత్ గౌరవ దర్శకత్వం వహించారు.

Related Posts