NBK109 స్పెషల్ గ్లింప్స్ వచ్చేస్తుంది!

టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో సూపర్ ఫామ్ లో దూసుకెళ్తున్న హీరో ఎవరంటే నటసింహం బాలకృష్ణ పేరే ముందుగా చెప్పాలి. హిట్స్ లో హ్యాట్రిక్ కొట్టేసిన బాలయ్య ఇప్పుడు తన 109వ సినిమాతో రెడీ అవుతున్నాడు. ‘వాల్తేరు వీరయ్య’ హిట్ తో ఫామ్ లో ఉన్న బాబీ ఈ సినిమాకి దర్శకుడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో ప్రెస్టేజియస్ గా నిర్మిస్తున్న బాలకృష్ణ 109వ చిత్రం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి గ్లింప్స్ రాలేదు.. టైటిల్ రివీల్ కాలేదు.. హీరోయిన్ ఎవరనే దానిపైనా క్లారిటీ లేదు. ఇప్పుడు వాటిన్నింటికీ సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని NBK 109 నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతుంది టీమ్. ‘లెట్స్ వెల్కమ్ వైలెన్స్ ఆన్ దిస్ శివరాత్రి’ అంటూ ఈ మూవీ గ్లింప్స్ ఎంత వైలెంట్ గా ఉంటుందో తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో ఓ గొడ్డలిని పట్టుకుని నరకడానికి సిద్ధమైన ఉగ్ర నరసింహంగా నటసింహం రూపు కనిపిస్తుంది. ఈ పోస్టర్ లో బాలయ్య లుక్ ను పూర్తిగా రివీల్ చేయలేదు

Related Posts