నితిన్ ఫన్నీ అడ్వెంచర్

నితిన్.. ఒక్క హిట్ కొడితే నాలుగైదు ఫ్లాపులు చూస్తున్నాడు. ఆడియన్స్ తన నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అనే అంశంలో నితిన్ ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాడు. ఇటు ఆడియన్స్ కూడా అతన్ని ఏదో ఒక జానర్ లో ఫిక్స్ చేయలేకపోతున్నారు. దీంతో కొన్ని మంచి కంటెంట్స్ కూడా పోయాయి. గత రెండేళ్లలో భీష్మ మాత్రమే హిట్. తర్వాత మూడు నాలుగు ఫ్లాపులు పడ్డాయి.

అయినా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో భీష్మ కాంబినేషన్ రిపీట్ అవుతోన్న సినిమా కూడా ఉంది. దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన్నా కలిసి చేస్తోన్న సినిమా ఇది. అందుకే షార్ట్ ఫామ్ లో ”విఎన్ఆర్”ట్రియో అని పిలుచుకుంటున్నారు. ఇక ఈ కాంబోలోనే వచ్చిన భీష్మ మంచి ఎంటర్టైనర్ గా నిలిచింది. కామెడీ పంచడంలో వెంకీ కుడుముల స్టైల్ అందరికీ నచ్చుతుంది. క్లీన్ కామెడీ రాయగలడు. అదే టైమ్ లో మంచి సెటైర్స్ కూడా వేస్తాడు. అందుకే ఈ కాంబో రిపీట్ అవుతుందన్నప్పుడు మరో మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనుకున్నారు అంతా. అయితే ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న అడ్వెంచర్ కూడా యాడ్ చేస్తున్నారట ఈ సారి. అంటే అడ్వెంచరష్ ఫన్ అన్నమాట.

కేవలం ఎంటర్టైన్మెంట్ ను మాత్రమే నమ్ముకున్నా ఇవాళా రేపు వర్కవుట్ కావడం లేదు. హీరోల ఇమేజ్ లను దాటి ఏదైనా కొత్తగా చూపిస్తే ఆడియన్స్ కూడా కొత్తదనం ఫీలవుతున్నారు. మంచి విజయాలను అందిస్తున్నారు. అందుకే అప్పుడెప్పుడో నితిన్ ద్రోణ అనే సినిమాలో ఈ తరహా అడ్వెంచర్స్ చేసినట్టు గుర్తు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా. ఈ తరహా చిత్రాలకు మంచి ఆదరణే ఉంటుంది. అలాగని అడ్వెంచర్ ఓవర్ డోస్ అయినా సమస్యే. అందుకే అటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అడ్వెంచర్ ను చూపించబోతున్నారట ఈ ట్రియో. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

ఇక దీంతో పాటు నితిన్ ఇప్పుడు వక్కంతం వంశీ డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. నితిన్ డేట్స్ ను రెండు సినిమాలకూ సమానంగా ఇచ్చి ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన లేటెస్ట్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

Related Posts