టాలీవుడ్ కు మరో బ్యాడ్ వీక్

తెలుగు సినిమాకు బ్యాడ్ ఫేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా వాల్యూబుల్ సమ్మర్ ను మిస్ చేసుకున్న తర్వాత మాన్ సూన్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెబుతారు అనుకుంటే జూన్ ఫస్ట్ వీక్ లో వచ్చిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ గా డిక్లేర్ అయ్యాయి. రెండో వారంలో వచ్చే చిత్రాలైనా కాస్తైనా మెప్పిస్తాయి అనుకుంటే ఈ వీకెండ్ కూడా గ్రాండ్ గా ఫెయిల్ అయింది. ఈ జూన్ 9న చాలా సినిమాలు విడుదలైనా ప్రధానంగా నాలుగు చిత్రాలపైనే చాలామంది అంచనాలు పెట్టుకున్నారు.

ముఖ్యంగా ఒకప్పటి లవర్ బాయ్ సిద్ధార్థ్ చాలా కాన్పిడెంట్ గా ప్రమోషన్ చేసిన టక్కర్ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందీ అనుకున్నారు. డబ్బింగ్ సినిమానే అయినా డబ్బులు తెస్తుందని భావించారు. బట్ టక్కర్ చాలా పెద్ద తలనొప్పి చిత్రం అని.. మొదటి ఆటకే డిజాస్టర్ గా తేలింది.


ఇక చాలామంది కమెడియన్స్ తో రైటర్ నుంచి దర్శకుడుగా మారిన డైమండ్ రత్నబాబు రూపొందించిన అన్ స్టాపబుల్ కనీసం మెప్పిస్తుందనుకున్నారు. పైగా దర్శకుడు చాలా మీకు నవ్వు రాకపోతే నాకు ఫోన్ చేయండి అని చెప్పాడు. కానీ సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడకుండా అతనికి వినిపించేలా బిగ్గరగా నవ్వాలి అని ఆడియన్స్ అనుకునేలా చేసిందీ చిత్రం. ఒక్క సీన్ కూడా జెన్యూన్ గా లేదు. ఎప్పుడో నైన్టీస్ లో వచ్చిన పాయింట్ తో ఏ మాత్రం పసలేని డైలాగ్స్, సీన్స్ తో ఓ రేంజ్ లో బోర్ కొట్టించాడు.


దీంతో పాటు ట్రైలర్ తో కాస్త సెన్సిబుల్ అనిపించుకుని.. కనీసం సెంటిమెంట్ చిత్రాలను ఇష్టపడేవారిని అయినా మెప్పిస్తుందనుకున్న సినిమా విమానం. సముద్రఖని, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మరీ బోరింగ్ కాదు కానీ.. అంచనాలను అందుకోలేకపోయింది. పైగా స్టార్ కాస్ట్ లేకపోవడంతో మెజారిటీ ఆడియన్స్ కు చేరలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించుకున్నా.. సెకండ్ హాఫ్‌ పోయింది. మళ్లీ క్లైమాక్‌స్ లో మెప్పించినా.. ఓవరాల్ గా సినిమా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది.


ఇక నాలుగో సినిమా ఇంటింటి రామాయణం. ప్రామిసింగ్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సమర్పించిన చిత్రం ఇది. ఈ మధ్య తెలంగాణ బేస్డ్ మూవీస్ కు మంచి ఆదరణ ఉంటోంది. ఆ తరహాలోనే వచ్చిన ఇంటింటి రామాయణం కనీసం ప్రమోషన్స్ లేక అసలు వచ్చిందన్న సంగతే తెలియకుండా పోయింది. కాకపోతే ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి కాబట్టి.. బావుంటే మౌత్ టాక్ తో అయినా మెప్పించేదేమో. కానీ బలహీనమైన కంటెంట్ తో తేలిపోయింది.
మొత్తంగా ఈ టాలీవుడ్ కు మరో బ్యాడ్ వీక్ పడింది. మరి మొత్తాన్ని మార్చి.. బ్లాక్ బస్టర్ కళను తెచ్చేది ఆదిపురుష్ అని నమ్ముతున్నారు ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనం. అంటే ఇక ఆశలన్నీ ఆదిపురుష్ పైనే అన్నమాట.

Related Posts