TFJA ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా అసోషియేషన్ ఏర్పాటు

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFDA) ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పత్రికా రంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రధాన మీడియాతోపాటు డిజిటిల్ మీడియాలో వెబ్‌సైట్స్, సోషల్ మీడియా, ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రసార, సమాచారం రంగంలో కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇప్పటికే సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా సేవలు అందిస్తున్న తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ (TFJA)కు అనుబంధంగా సేవలు అందించేందుకు ఈ అసోసియేషన్ ఏర్పాటు జరిగింది. ఈ ఆవిర్బావ సమావేశంలో సినీ ప్రముఖులు దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే టీఎఫ్‌జేఏ కార్య నిర్వాహక కమిటీ సభ్యులు, ప్రసిడెంట్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్, సభ్యులు జీవీ, శేఖర్, వీఆర్ మథు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ కార్యవర్గాన్ని ప్రకటించారు.

Related Posts