ఆ విషయంలో ఒన్ అండ్ ఓన్లీ దర్శకధీరుడు రాజమౌళి!

దర్శకుడు అంటే ఎలా ఉండాలి? ప్రతీ సన్నివేశాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి ఆయన పడే తపన ఏంటి? అనే విషయాలు మచ్చుకు తెలియాలంటే దర్శకధీరుడు రాజమౌళిని చూస్తే అర్థమవుతుంది. రాజమౌళి ఒక సినిమాని మొదలుపెట్టాడంటే అహర్నిశలు ఆ చిత్రంపైనే దృష్టి పెడతాడు. తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చేందుకు.. ఎంత సమయాన్నైనా తీసుకుంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రతీ సన్నివేశాన్ని తానే రిహార్సల్స్ చేసి.. ఆ తర్వాత నటీనటులకు వివరిస్తాడు.

రాజమౌళి సినిమాల్లోని సన్నివేశాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయి. మరి.. దానివెనుక జక్కన్న ఎంతటి శ్రమ చేస్తే.. అవి అంత అద్భుతంగా పండుతాయి. ఉదాహరణకు.. ‘బాహుబలి 2‘ ఇంటర్వెల్ సీక్వెన్స్ లోని మాహిష్మతి గొప్పదనాన్ని చాటిచెప్పే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించేకంటే ముందే రాజమౌళి తన క్రూతో రిహార్సల్ చేశాడు. ఇప్పుడు ఆ రిహార్సల్ కి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

సినిమాల వరకే కాదు.. తన జీవితంలో చేసే ఏ పని అయినా అంతే డెడికేషన్ తో చేయడం జక్కన్న హాబీ. ఇటీవలే ఓ పెళ్లివేడుకలో తన భార్య రమాతో కలిసి రాజమౌళి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఆ డ్యాన్స్ కోసం కూడా రాజమౌళి చేసిన రిహార్సల్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట లీకయ్యింది.

Related Posts