టాలీవుడ్

ఆదిపురుష్‌ ను లైట్ తీసుకుంటున్న ఫ్యాన్స్

ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మూడు రోజుల్లోనే 340 కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీతో ప్రభాస్ వరుసగా మొదటి రోజే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక హీరోగా అవతరించాడు. కలెక్షన్స్ పరంగా ఆదిపురుష్ అదరగొడుతున్నా.. విమర్శల పరంగా మాత్రం బదులు లేని విధంగా ఎదుర్కొంటోంది. రామాయణ గాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ తెరకెక్కించాడు. బట్ అతని డైరెక్షన్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుటే అంత మంచిది అన్నట్టుగా తయారయింది. ముఖ్యంగా ప్రభాస్ రాముడుగా అస్సలు నప్పలేదు అని ఒక వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఎలా చూసినా ఇది అభాసుపాలైన చిత్రంగానే చెబుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ ట్రోల్స్ పై పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అందుకు కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్లే వాళ్లు ఆదిపురుష్ ను లైట్ తీసుకుంటున్నారు.


నిజానికి ఆదిపురుష్ రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేసిందే. కలెక్షన్స్ వచ్చినంత మాత్రాన ఇదం కళాఖండం కాదు. ఇంకా చెబిత ఇప్పటి వరకూ వచ్చిన చెత్త రామాయణ కథ ఇదే అంటే అతిశయోక్తీ లేదు. భక్తి భావం ఉన్నవాళ్లు కూడా ఏదో మూల ఇబ్బంది పడేలా తీశాడు ఓమ్ రౌత్. ఈ విషయంలో ఫ్యాన్స్ ప్రిపేర్డ్ గా ఉన్నారనేది నిజం. అందుకే విమర్శలను, ట్రోల్స్ ను లైట్‌ తీసుకుటున్నారు. అందుకు కారణం తర్వాత వచ్చే ప్రభాస్ సినిమాలే.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సినిమా సలార్ ఈ యేడాది సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందనేది వారి ఫీలింగ్. దీంతో పాటు ప్రాజెక్ట్ కే కూడా ఉంది. ఈ రెండు సినిమాలు ప్రభాస్ ను గ్లోబల్ రేంజ్ లో తిరుగులేని స్టార్ గా నిలుపుతాయని ట్రేడ్ కూడా అంచనా వేస్తోంది. అలాగే రాజాడీలక్స్ కూడా కంటెంట్ పరంగా ప్రభాస్ ను ఈ మొనాటనీ నుంచి కాస్త కొత్తగా చూపించే అవకాశం ఉంది.

దీంతో ఇవి వచ్చిన తర్వాత చూసుకుందాం ఆ ట్రోల్స్ అన్నీ అనేది ఫ్యాన్స్ ఫీలింగ్ అంటున్నారు. మరో విశేషం ఏంటంటే.. సలార్ ఆల్రెడీ పూర్తయింది. ప్రాజెక్ట్ కే ఈ యేడాది చివరికి వరకూ రెడీ అవుతుంది. 2024 సంక్రాంతి రిలీజ్ అని పోస్టర్ కూడా వేశారు. రాజా డీలక్స్ కు సంబంధించి ప్రభాస్ వర్క్ ఫిబ్రవరి వరకూ పూర్తవుతుంది. అంటే వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రభాస్ షూటింగ్స్ పరంగా ఖాళీ అవుతాడు. ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగాతో ”స్పిరిట్”అనే సినిమా ఉంది. సందీప్ లేటెస్ట్ మూవీ యానిమల్ ఆగస్ట్ 11న వస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఆటోమేటిక్ గా స్పిరిట్ పై అంచనాలు పెరుగుతాయి. సో.. ఎలా చూసినా ఈ ప్రపంచానికి అసలు ప్రభాస్ ను చూసే టైమ్ ముందు ఉంది. అందుకే ఆదిపురుష్ ను లైట్ తీసుకుందాం అని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయ్యారట. అందుకే ఎన్ని ట్రోల్స్ వచ్చినా కౌంటర్స్ పెద్దగా పడటం లేదు. మరి అభిమానుల ఆశలను రాబోయే సినిమాలు నెరవేరుస్తాయా లేదా అనేది చూడాలి.

Telugu 70mm

Recent Posts

NehaSolanki

2 mins ago

Varsha Bollamma

18 mins ago

Eesha Rebba

22 mins ago

ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పడేసిన ప్రభాస్ పోస్ట్

రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి.…

49 mins ago

హైకోర్టుకు చేరిన ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం

జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని…

5 hours ago