సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తోన్న ‘మంజుమ్మల్ బాయ్స్’

మలయాళంలోనే అత్యంత ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా అరుదైన రికార్డును కొల్లగొట్టింది ‘మంజుమ్మల్ బాయ్స్’. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, గణపతి, ఖలీద్ రెహమాన్ ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు వసూళ్లును సాధించింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది మైత్రీ మూవీ మేకర్స్.

ఏప్రిల్ 6న ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొంతమంది ఫ్రెండ్స్ బ్యాచ్ తమిళనాడులోని కొడైకెనాల్‌ టూర్ కి వెళ్తారు. వారు హిల్ స్టేషన్ తో పాటు కమల్ హాసన్ ‘గుణ’ చిత్రీకరించబడిన డెవిల్స్ కిచెన్ అని పిలువబడే గుణ కేవ్స్ ను ఎక్స్ ఫ్లోర్ చేస్తారు. దురదృష్టవశాత్తు, స్నేహితుల్లో ఒకరు గుహలోని లోతైన గుంటలలో ఒకదానిలో పడిపోతాడు, మిగతా వారు భయాందోళనలకు గురౌతారు. మిగాతా అంతా ఆ వ్యక్తిని ఎలా రక్షించారనేదే స్టోరీ. ట్రైలర్ అయితే థ్రిల్లింగ్ గా ఉంది. మరి.. ఇటీవలే మలయాళం నుంచి వచ్చిన ‘ప్రేమలు’ తరహాలోనే ‘మంజుమ్మల్ బాయ్స్’ కూడా తెలుగులో హిట్ అవుతుందేమో చూడాలి.

Related Posts