డిసెంబర్ రెండో వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి భారీగానే ఉంది. నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. అయితే.. వీటిలో నాని, నితిన్ సినిమాలు మాత్రం ప్రచారంలో స్పీడు పెంచాయి. ముఖ్యంగా పాటల విషయంలో పోటీపడుతున్నాయి.
ఇప్పటికే నాని ‘హాయ్ నాన్న’ నుంచి మూడు పాటలొచ్చాయి. మూడింటికీ మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక.. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ హేరిస్ జయరాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్న ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్’ నుంచి ఇప్పటికే రిలీజైన ‘డేంజర్ పిల్లా’ సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘బ్రష్ వేసుకో..’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజయ్యింది. ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్ కి తోడు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని సంజిత్ హెగ్డే ఆలపించాడు.
రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ‘ఎక్స్ట్రా ఆర్టినరీ మ్యాన్’ టీజర్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్మెంట్స్, రుచిర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8న ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్’విడుదలకు ముస్తాబవుతోంది.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…