నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. ‘శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న’లతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘అంటే సుందరానికి’ దర్శకుడు వివేక్ ఆత్రేయ తో ‘సరిపోదా శనివారం’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నాని మరో మూడు చిత్రాలను లైన్లో పెట్టాడు. వాటిలో ముందుగా పట్టాలెక్కాల్సిన మూవీ నాని 32.

సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. ఇప్పటికే డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ లో ‘ఓజీ’ సినిమాని తెరకెక్కిస్తున్న సుజీత్.. నాని తో సినిమాని సైతం సైమల్టేనియస్ గా కంప్లీట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమధ్య ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోని కూడా విడుదల చేశారు.

అయితే.. బడ్జెట్ లెక్కల దృష్ట్యా నాని-సుజీత్ మూవీని డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ పక్కన పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో.. ఇప్పటికే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సినిమా చేయాలనే ఒప్పందం ఉన్న సుజీత్.. నాని ప్రాజెక్ట్ ను ఆ సంస్థకే చేయబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది.

మరోవైపు.. ‘ఓజీ’ పూర్తయ్యేవరకూ డి.వి.వి. నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దాంతో.. నాని-సుజీత్ మూవీ ఉంటుందా? లేదా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.

Related Posts