సుహాసిని కొడుకు పెళ్లిలో ఎన్టీఆర్, మోక్షజ్ఞ సందడి

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల సోదరి.. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కొడుకు పెళ్లి వేడుకలో నందమూరి కుటుంబం మొత్తం సందడి చేసింది. అయితే ఈ కార్యక్రమంలో అందరి కళ్లూ ఎన్టీఆర్ పైనే ఉండటం విశేషం. ఆయన ఈ కుటుంబంతో కలిసిపోతాడా.. ఆ కుటుంబం ఆయన్ని ఆప్యాయంగా చూస్తుందా అనుకున్నారు. బట్ ఇన్ని రోజులు బయట వినిపించిన వార్తలకు వీరి వివాహ వేడుకలో కనిపించిన దానికి సంబంధమే లేదు. అందరూ ఒక కుటుంబంగా కలిసిపోయారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ తనుగా వెళ్లి బాలకృష్ణతో కరచాలనం చేయడం ఆహూతులకు ఆనందాన్ని పంచింది. బయట ఎన్ని ఉన్నా.. కుటుంబంగా బాబాయ్ అబ్బాయ్ ల మధ్య మంచి బంధమే ఉందనుకున్నారు. ఇక కళ్యాణ్‌ రామ్ తో కలిసి ఎన్టీఆర్ పెళ్లిమండపం అంతా సందడి సందడిగా తిరిగారు. ఇక ఈ వేడుకలో ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్ లతో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అటు సుహాసిని కూడా తమ్ముళ్లిద్దరినీ ఆప్యాయంగా చూసుకుంటున్న వీడియోలు కూడా అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. మొత్తంగా సుహాసిని ఇంట జరిగిన పెళ్లి నందమూరి కుటుంబం మొత్తాన్ని ఒకే చోట చూసే అవకాశం కల్పించింది.

Related Posts