ఎమోషనల్ డోస్ ఆఫ్ ‘రోటి కపడా రొమాన్స్‘

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ అందించిన బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో వస్తోన్న మరో యూత్ ఫుల్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్‘. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ డోస్ పేరుతో ఆమధ్య ఓ రొమాంటిక్ గ్లింప్స్ రిలీజయ్యింది. ఆ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.

న‌లుగురు స్నేహితుల క‌థతో సాగే ఈ మూవీలో యూత్‌ ఫుల్ మూమెంట్స్ , ఫ్రెండ్‌ షిప్, రొమాన్స్ తో పాటు.. ఎమోషనల్ కంటెంట్ తో లేటెస్ట్ గా ‘రోటి కపడా రొమాన్స్‘ ఎమోషనల్ డోస్ ని వదిలింది టీమ్. ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది

Related Posts