HomeMoviesటాలీవుడ్కేరళతో పాటు తమిళనాడునీ ఊపేస్తున్న ‘మంజుమ్మెల్ బాయ్స్‘

కేరళతో పాటు తమిళనాడునీ ఊపేస్తున్న ‘మంజుమ్మెల్ బాయ్స్‘

-

మలయాళం చిత్రం పరిశ్రమ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటుంది. ఫిబ్రవరి 9న విడుదలైన ‘ప్రేమలు‘ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా బ్లాక్ బస్టర్ సాధించింది. కేవలం 3 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్ల వసూళ్లను సాధించింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు సైతం వచ్చింది. తెలుగులోనూ ‘ప్రేమలు‘కి మంచి ఆదరణ దక్కుతుంది.

‘ప్రేమలు‘ చిత్రం వచ్చిన రెండు వారాలకు మలయాళంలో విడుదలైన మరో చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్‘. 2006లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా చిదంబరం అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్ఘీస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కోచికి సమీపంలోని మంజుమ్మెల్ అనే టౌన్ కి చెందిన కుర్రాళ్ల కథ ఇది. ‘మంజుమ్మెల్ బాయ్స్‘ వెకేషన్ కోసం తమిళనాడులోని కొడైకెనాల్ వెళ్లడం.. అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

కొడైకెనాల్ లో కమల్ హాసన్ ‘గుణ‘ సినిమా చిత్రీకరించిన ప్రదేశాల్లోనే ఈ సినిమాని చిత్రీకరించారు. ఇక.. ఈ మూవీలో ‘గుణ‘ రిఫరెన్సెస్ చాలానే ఉన్నాయి. అందుకే.. కేరళ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. తమిళనాడులోనూ రూ.25 కోట్లు వసూళ్లను సాధించింది. మరోవైపు నార్త్ అమెరికాలో ఒన్ మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించిన తొలి మలయాళం చిత్రంగా నిలిచింది. ఇప్పటికే మలయాళంలో టాప్ 5 ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ‘మంజుమ్మెల్ బాయ్స్‘.. లాంగ్ రన్ లో మరెన్నో సంచలనాలు సృష్టించబోతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

ఇవీ చదవండి

English News