దుల్కర్ సాల్మన్ ‘లక్కీ భాస్కర్’

మోస్ట్ టాలెంటెడ్ స్టార్ దుల్కర్ సాల్మన్ తెలుగులోనూ తనదైన శైలిలో అభిమానులను సంపాదించుకున్నాడు. మొదట ఓకే బంగారంతో ఆకట్టుకున్నా తర్వాత మహానటి సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని అదరగొట్టాడు. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన సీతారామంతో బ్లాక్ బస్టర్ అందుకుని మనవారికీ ఫేవరెట్ హీరో అయిపోయాడు.

బేసికల్ గా మళయాలంలో టాప్ హీరో అనిపించుకున్న దుల్కర్ అక్కడే ఆగకుండా అన్ని భాషలూ చుట్టేస్తున్నాడు. అలా తమిళ్, హిందీతో పాటు తెలుగులోనూ అదరగొడుతున్నాడు. కొన్నాళ్లుగా దుల్కర్ మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు అనే టాక్ ఉంది. తన బర్త్ డే సందర్భంగా ఆ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి “లక్కీ భాస్కర్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్ లో వంద రూపాయల నోట్ వెనక నవ్వుతూ ఉన్న దుల్కర్ ఫోటో ఉంది. భాస్కర్ అనే పేరులో చివర ఆర్ అనే అక్షరానికి బదులుగా రూపీ సింబల్ ఉంది.

అంటే ఇది డబ్బు చుట్టూ తిరిగే కథ అని ఇట్టే అర్థమైపోతుంది. సితార బ్యానర్ తో పాటు త్రివిక్రమ్ ఫార్చూన్ బ్యానర్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఇప్పటి వరకూ వెంకీ అట్లూరి చేసినవన్నీ సాఫ్ట్ స్టోరీస్. ప్రేమకథలు చేశాడు. బట్ ఫస్ట్ టైమ్ తన కంఫర్ట్ జోన్ దాటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో అతని టేకింగ్ చూస్తే మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు అనిపించుకోలేదు. బట్ మరి ఈ మూవీతో ఆ వైపుగా ఏమైనా ఆకట్టుకుంటాడేమో కానీ.. ఈ టైటిల్ మాత్రం ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్‌ కుమార్ సంగీతం అందించబోతుండటం విశేషం.

Related Posts