అప్పుడే ఓటిటిలోకి బ్రో

పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ మూవీ బ్రో కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత పవన్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడీ సినిమాలో. రీమేకే అయినా.. పవన్ పోర్షన్ అంతా ఒరిజినల్ లో పెద్దగా కనిపించదు. ఉన్నా అది పూర్తిగా వేరే ట్రాక్ లో ఉంటుంది. బట్ ఇది అలా కాదు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుంది. దీంతో మరీ ఒరిజినల్ చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు ఆడియన్స్ కు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ పోర్షన్ అంతా బాగా వర్కవుట్ అయింది. సాయితేజ్ లో కలిసి వచ్చే సీన్స్ హైలెట్ గా నిలిచాయి. అటు సాయితేజ్ కూడా తనదైన శైలిలో ఆ పాత్రను పండించాడు. తమన్ సంగీతంలో పాటలు మైనస్ గా ఉన్నా.. నేపథ్య సంగీతం ఒకే అనిపిస్తుంది. పవన్ డ్యాన్సులు, త్రివిక్రమ్ డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్ కు బాగా నచ్చుతున్నాయి.


ఇక ఈ సినిమా ఓటిటిలోకి ఎప్పడు వస్తుంది అని ఎదురుచూసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మామూలుగా మన సినిమాలు విడుదలైన 45రోజుల తర్వాతే ఓటిటిలోకి రావాలి. కానీ కొన్ని సినిమాలు థియేటర్స్ లో బిగ్ డిజాస్టర్ అనిపించుకుని ఆ రూల్ ను అతక్రమించి వెంటనే ఓటిటిల్లోకి వస్తున్నాయి. థియేటర్స్ లో పోయాయి కాబట్టి ఆ రూల్ బ్రేక్ చేసినా వారిని సీరియస్ గా తీసుకోవడం లేదెవరూ. రూల్ ప్రకారం చూస్తే బ్రో సినిమా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఓటిటిలోకి విడుదలవుతుంది.

అయితే ఏ ఓటిటిలో వస్తుంది అనే డౌట్ చాలామందిలో ఉంది. ఎందుకంటే ఈ మూవీ ఓటిటి రైట్స్ ఎవరు తీసుకున్నారు అనేది విడుదలకు ముందు తెలియదు. బట్ రిలీజ్ డే రోజు వెండితెరపైనే వేశారు. నెట్ ఫ్లిక్స్ సంస్థను తమ డిజిటల్ పార్టనర్ గా ప్రకటించారు. సో.. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్ట్రీమ్ అవుతుందన్నమాట. సో.. ఇప్పుడు వర్షాల వల్ల మిస్ అయిన వాళ్లు అప్పుడు చూసుకోవచ్చు.

Related Posts