అందాలరబోసింది ఆఫర్ పట్టేసింది..

ఆఫర్స్ లేని హీరోయిన్ లు అదే పనిగా ఎందుకు ఫోటోషూట్స్ చేస్తారో తెలుసు కదా..? యస్.. అందరి అటెన్షన్ గ్రాబ్ చేయడానికి.. ప్రస్తుతం తాము ఖాళీగానే ఉన్నాం.. ఒక ఆఫర్ ఇవ్వండని ఇన్ డైరెక్ట్ గా చెప్పడానికే. అయితే అన్నిసార్లూ ఈ ఫోటో షూట్స్ వర్కవుట్ కావు. కొందరికి మాత్రమే కలిసొస్తుంది. అలా ఇప్పుడు ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఫైనల్ గా ఓ ఆఫర్ పట్టేసింది.

తను చివరిగాతెలుగులో అల్లుడు అదుర్స్ లో నటించింది. ఆ సినిమా రిజల్ట్ కు ఆడియన్స్ బెదిరిపోయారు. అదే టైమ్ లో అమ్మడికి ఓ చిన్న ప్రమాదం జరిగింది. భుజానికి ఆపరేషన్ కూడా చేశారు. అందుకోసం ఏకంగా ఏడాది పాటు టైమ్ తీసుకుంది. ఈ యేడాది ఆరంభంలో ఆ విషయం చెప్పింది. ఇక నాలుగు నెలల నుంచి అదే పనిగా ఫోటో షూట్స్ లో అందాలారబోస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది.

అయితే చాలామంది ఇక తన పని అయిపోయినట్టే.. ఇదంతా వృథా ప్రయత్నం అన్నారు. బట్ తన కృషి ఫలించింది. ఓ మంచి ఆఫర్ పట్టేసింది. అదేదో సినిమాలో చెప్పినట్టుగా.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలుపెట్టాలి అన్నట్టుగా.. ఏ సినిమాతో తను ఆగిపోయిందో.. ఆ సినిమా హీరోతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. అవును.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది నభా నటేష్‌.

తన చివరి సినిమా అల్లుడు అదుర్స్ లో అతనే కదా హీరో. ప్రస్తుతం శ్రీనివాస్ .. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ మూవీ ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షెడ్యూల్ తర్వాత హీరోయిన్ ఫైనల్ కావడం విశేషమే.


ఛత్రపతి డిజాస్టర్ తర్వాత శ్రీనివాస్ మరీ తొందరపడకుండా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ మూవీ విషయంలో కూడా జాగ్రత్తలు చాలానే తీసుకున్నాడు. అందుకే సినిమాను వచ్చే యేడాది విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారట. మొత్తంగా నభా నటేష్‌.. గ్లామర్ మాత్రమే కాదు.. మంచి నటన కూడా చూపించగలదు. అల్లుడు అదుర్స్ పోయినా.. వీరి పెయిర్ ఆకట్టుకుంది. అది ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

Related Posts