ప్రభాస్ కు హ్యాట్రిక్ ఫ్లాపులేనా ..?

బాహుబలితో వచ్చిన క్రేజ్ ను ప్యాన్ ఇండియన్ రేంజ్ లో బాగా విస్తరించుకున్నాడు ప్రభాస్. బాహుబలి రెండు భాగాలతో అతను ఇండియా మొత్తం మోస్ట్ ఫేవరెట్ స్టార్ అయిపోయాడు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ తో వచ్చిన సాహో సౌత్ లో చతికిలపడ్డా.. నార్త్ లో అదరగొట్టింది.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అది అతని నార్త్ ఫ్యాన్ బేస్ ను ప్రూవ్ చేసింది కూడా. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన రాధేశ్యామ్ మాత్రం నిరుత్సాహపరిచింది. తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా చేసిన ఈ లవ్ స్టోరీతో ఆడియన్స్ లవ్ లో పడలేకపోయారు.

దీంతో దేశవ్యాప్తంగానూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు భారీ అంచనాలు పెంచుతూ వచ్చిన ఆదిపురుష్ యూనానిమస్ గా ఒకే టాక్ రావడం విశేషం.

ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసుకుని తీసిన ఈ చిత్రానికి అక్కడ చాలా పూర్ రేటింగ్స్ వస్తున్నాయి. తరణ్ ఆదర్శ్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ ఈ చిత్రానికి 5కి ఒకటిన్నర రేటింగ్ ఇచ్చాడంటే ఈ సినిమా నార్త్ లో కూడా ఎలాంటి రిజల్ట్ తెచ్చుకోబోతోందో అర్థం చేసుకోవచ్చు.

నిజంగా తరణ్ ఆదర్శ్ రివ్యూస్ కు అక్కడ చాలా వాల్యూనే ఉంటుంది.
ఇక ప్రభాస్ కు సంబంధించినంత వరకూ దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోయాడు. బట్ ఏ దశలోనూ ఓ తెలుగువాడుగా రాముడి పాత్రేంటీ ఇలా ఉంది అని కానీ.. ఇతర పాత్రల గురించి కానీ ఎప్పుడూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అస్సలే మాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో పాటు ఆహార్యం, ఆంగికం కూడా అస్సలు సెట్ కాలేదు.

ఇక ప్రభాస్ లుక్ చూస్తే ఆయన పరశురాముడులా ఉన్నాడు తప్ప రాముడులా కనిపించలేదు అనే టాక్ అన్ని చోట్లా వినిపిస్తోంది. పైగా అనేక సన్నివేశాలు బాహుబలిని గుర్తుకు తెచ్చాయి. ఇక ప్రభాస్ ఇంటర్ డక్షన్ ఫైట్ చూస్తే దర్శకుడు ఓమ్ రౌత్ లో ఎంత పస ఉందో అర్థం అవుతుంది.

మొత్తంగా సౌత్ ఆడియన్స్ కు రాముడు అన్నా.. ఆ పాత్ర అన్నా ఒక స్పష్టమైన విజువల్ ఉంది. ఇక్కడ అన్ని భాషల్లోని రాముడు పాత్రలు చేసిన హీరోలు ఐకనిక్ గా వెళ్లారు. బట్ ఆదిపురుష్ టీమ్ చాలా మెకానికల్ గా వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక ఈ మూవీతో ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాపులు పడినట్టే అనేది విశ్లేషకుల అంచనా. మరి అదే నిజమవుతుందా. లేక బాక్సాఫీస్ వద్ద ఈ మోడ్రన్ రాముడు ఏదైనా మ్యాజిక్ చేస్తాడా అనేది చూడాలి.

Related Posts