గురూజీ.. పూజాను పట్టించుకోవడం లేదా..?

ఆస్తాన దర్శకులు, నటులు ఉన్నట్టుగానే ఆస్తాన హీరోయిన్లు కూడా ఉంటారు. హారిక హాసిని బ్యానర్ అంటే అది త్రివిక్రమ్ సొంత బ్యానర్ లా అన్నమాట. ఆయన ఆ బ్యానర్ కాక మరే బ్యానర్లోనూ సినిమా చేయడు. నిర్మాణ సంస్థతో ఆయన బంధం అంత గొప్పది. అయితే త్రివిక్రమ్ కు కూడా ఆస్తాన హీరోయిన్లు ఉంటారు. వీరు సీజన్స్ ను బట్టి మారుతుంటారు. ఒక్కో హీరోయిన్ ను రెండు మూడు సినిమాల వరకూ రిపీట్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన ఆస్థానంలో పూజాహెగ్డే ఉంది.

అరవింద సమేత వీరరాఘవ నుంచి మొదలైన ఈ కాంబినేషన్ అలవైకుంఠపురములో నుంచి ఇప్పుడు మహేష్‌ తో చేస్తోన్న గుంటూరు కారం వరకూ కంటిన్యూ అవుతోంది. అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా శ్రీ లీలను తీసుకున్నారు. ప్రస్తుతం హాటెస్ట్ సెన్సేషన్ గా ఉన్న ఈ బ్యూటీ ఎంట్రీతో పూజాహెగ్డేకు సమస్యలు మొదలయ్యాయట.


శ్రీ లీల ఈ ప్రాజెక్ట్ లోకి రావడానికి ముందే తనను కూడా హీరోయిన్ లానే చూడాలని.. సెకండ్ హీరోయిన్ అనేమాటే వాడొద్దనే కండీషన్ పెట్టిందనే టాక్ వచ్చింది. అందుకు ఒప్పుకున్న మూవీ టీమ్ అలాగే ప్రొసీడ్ అయింది. అయితే రాన్రానూ శ్రీ లీల క్రేజ్ టాలీవుడ్ లో అమాంతంగా పెరగిపోతోంది. రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా వచ్చిన ఫోటోస్ చూశాం కదా..? ఈ రేంజ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇండియాలోనే ఏ హీరోయిన్ చేతిలో లేవు అంటే అతిశయోక్తి కాదు.

ఏకంగా తొమ్మిది సినిమాలు చేస్తోంది. ఈటిలో ఒకటి కన్నడలో ఉంది. మిగతా ఎనిమిదీ తెలుగులోనే. అందుకే తన పాత్రను ముందు అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ పెంచాడట త్రివిక్రమ్. అంతేకాక ఒక పాట కూడా అదనంగా యాడ్ చేశాడట. ఇది నిజానికి పూజాహెగ్డే సాంగ్ అంటున్నారు. దీంతో పూజా కూడా హర్ట్ అయిందట. బట్ తను ఇప్పుడేమంత బిజీగా లేదు. ఆ కారణంగానే కామ్ గా ఉంటోందట. కానీ ఛలాకీ చిన్నది శ్రీ లీల ఎంట్రీతో ఈ డస్కీ బ్యూటీకి చిరాకులు కూడా పెరుగుతున్నాయట. ఈ మేరకు టాలీవుడ్ లో తెగ చెప్పుకుంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది మూవీ టీమే చెప్పాలి..

Related Posts