మేచో స్టార్ గోపీచంద్ ఎంత టాలెంటెడో అందరికీ తెలుసు. ఒకప్పుడు మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి మూవీస్ అందించాడు. ఓ దశలో టైర్ టూ హీరోస్ లో టాప్ ప్లేస్ లో ఉన్న గోపీచంద్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఫ్లాపుల విషయంలో మాత్రం చాలామంది అతన్నే తప్పు పడుతుంటారు. ఏ మాత్రం కొత్తదనం లేని కథలు ఒప్పుకుంటున్నాడు అనేది గోపీచంద్ పై ఫ్యాన్స్ లోనూ ఉన్న కమెంట్.
ఈ విషయంలో అతను మారడం లేదు అనేది నిజం. 2015లో వచ్చిన జిల్ తర్వాత అతను తొమ్మిది సినిమాలు చేశాడు. ఇవన్నీ పోయాయి అంటే అతని కెరీర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వీటిలో సీటీమార్ కమర్షియల్ గా ఫర్వాలేదు అనిపించుకున్నా కంటెంట్ మాత్రం రొటీనే. అతను చాలా హోప్స్ పెట్టుకున్న గౌతమ్ నందా, పంతం నిరాశపరిచాయి. ఇక చాణక్య, ఆరడుగుల బుల్లెట్ వంటి చిత్రాలైతే నవ్వులపాలయ్యాయి.
ఇక రీసెంట్ గా వచ్చిన రామబాణంలో కథ అనే విల్లు సరిగా లేక బాణం టార్గెట్ చేరలేదు. అయినా ఇప్పుడు భీమా అంటూ ఫెరోసియస్ మూవీతో వస్తున్నాడు. కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. అయితే గతంలో గోపీచంద్ గోలీమార్ అనే సినిమాలో పోలీస్ గా నటించాడు.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన గోలీమార్ లో గోపీచంద్ పోలీస్ గా నటించాడు. అయితే పోలీస్ ల చేతిలోనే మోసపోయి తను గ్యాంగ్ స్టర్ గా మారతాడు ఆ చిత్రంలో. బ్లాక్ బస్టర్ కాదు కానీ గోలీమార్ బానే ఆడింది. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రోజా ఆమె తల్లిగా నటించడం విశేషం. ఈ సినిమా వచ్చి ఇప్పటికి పన్నెండేళ్లవుతోంది.
ఇన్నేళ్ల తర్వాత ఖాకీ డ్రెస్ వేసిన గోపీచంద్ కు ఈ ఖాకీ విజయాన్ని ఇవ్వడం ఖాయం అంటున్నారు మేకర్స్. తాజాగా అతని బర్త్ డే సందర్భంగా వచ్చిన లుక్ చూస్తే ఇది కదా అతన్నుంచి ఎక్స్ పెక్ట్ చేసేది అన్నట్టుగానే ఉంది. కానీ కంటెంట్ పూర్తిగా చూస్తే తప్ప ఏదీ నమ్మే పరిస్థితి లేదిప్పుడు. అయినా.. ఈ భీమా అతనికి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుందాం..
No matter how many heroes we have, there are only a few who have reached…
Elections are going to be held in two Telugu states tomorrow (May 13). While elections…
Most Awaiting Movie 'Double Ismart' Starring Energetic Star Ram. This movie is being made as…
మనకు ఎంతమంది హీరోలున్నా.. నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్…
రేపు (మే 13న) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‘. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్‘కి…