వైష్ణవికి ‘బేబీ’తో కెరీర్ ముగిసినట్టేనా..

వైష్ణవి చైతన్య.. ప్రస్తుతం టాలీవుడ్ లో మార్మోగుతున్న పేరు. బేబీ సినిమాలో బోల్డ్ యాక్ట్ తో అందరినీ మెప్పించింది. నిజానికి ఈ పాత్రలో తను జీవించిందనే చెప్పాలి. అద్భుతమైన నటన. నెగెటివ్ రోల్ అని చెప్పలేం. సెల్ఫిష్ అనలేం. కానీ ఓ నిస్సహాయ స్థితిలో తన పాత్ర దిగజారిపోతుంది. అది సరిదిద్దుకోలేని తప్పుగా మారి తను ప్రేమించిన, తనను ప్రేమించిన వాడికి దూరం అవుతుంది. ఇన్ని షేడ్స్ ఉన్న పాత్రలో వైష్ణవి ఒదిగిపోయింది.

అందుకే సర్వత్రా ఆమె నటనకు అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఈ మూవీ కమర్షియల్ గా కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే ఇక్కడే ఓ పెద్ద కంపారిజన్ కనిపిస్తోంది. దాన్ని విశ్లేషిస్తే అమ్మడి కెరీర్ ఆల్రెడీ ప్రమాదంలో పడినట్టే అంటున్నారు చాలామంది. అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ఇలా ఇంతకు ముందు ఆర్ఎక్స్ 100లో దాదాపు ఇదే తరహా పాత్రలో కనిపించిన పాయల్ రాజ్ పుత్ నటనకు కూడా అప్పుడు మంచి ప్రశంసలు వచ్చాయి.

కానీ ఆమె కెరీర్ ఏమైందో అందరికీ తెలుసు. తను కేవలం ఈ తరహా పాత్రలకే పరిమితం అనే ముద్ర వేశారు. అవే ఇచ్చారు. ఓ దశలో తనకే మొనాటనీ వచ్చింది. అలాగని వేరే ఆప్షన్స్ కూడా రాలేదు. దీంతో ప్రస్తుతం తన కెరీర్ క్లైమాక్స్ లో ఉందనే చెబుతున్నారు.


ఇక ఇదే తరహాలో అర్జున్ రెడ్డిలో నటించిన షాలినీ పాండేను కూడా మరో ఉదాహరణగా చూపిస్తున్నారు.ఈ కథలో నెగెటివ్స్ ఏం లేవు. కానీ షాలినీ బోల్డ్ యాక్ట్ గురించి చెబుతున్నారు.అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండతో పాటు గొప్ప నటన చూపించిన అమ్మడి కెరీర్ మాత్రం పూర్తిగా డల్ అయిపోయింది.
అలాగే ఇప్పుడు వైష్ణవి చైతన్యకు జరుగుతుంది అంటున్నారు.

అలా జరగకూడదంటే తర్వాత తను ఎంచుకునే పాత్రల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ మాత్రం బేబీ తరహా బోల్డ్ యాక్ట్ రిపీట్ అయినా తన కెరీర్ కు చాలా వేగంగా శుభం కార్డ్ పడుతుంది. లేదంటే బోల్డ్ యాక్ట్రెస్ అనే నెగెటివ్ ఇమేజ్ స్ప్రెడ్ అవుతుంది. సో.. బీ కేర్ ఫుల్ బేబీ..

Related Posts