ఆదిపురుష్ దర్శకుడు మరీ ఇంత దిగజారాలా ..?

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కింది. గత సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అంతకు ముందు వచ్చిన టీజర్ లోని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూసి జనం జడుసుకుంటే, ఫ్యాన్స్ మండిపడితే పోస్ట్ పోన్ అయింది. మళ్లీ సినిమా మొత్తానికి రీ గ్రాఫిక్స్, రీ విఎఫ్ఎక్స్ చేశారు.అలా చేశాం అని చెబుతూ ఈ మధ్య వదిలిన రెండు మూడు పోస్టర్ ఓకే అనిపించుకున్నాయి తప్ప సూపర్ అనలేదెవరూ. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి జై శ్రీరామ్ అంటూ ఒక నిమిషం లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

ఇలా చేయడంలో ఏ తప్పూ లేదు. కానీ ఆ పాటను రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయడం మాత్రం చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. ఇది కావాలనే చేసినట్టుగా చెబుతున్నారు చాలామంది. రంజాన్ ముస్లీమ్ ల పవిత్ర పండగ. వారిలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అది తెలిసి కూడా వారితోనూ జై శ్రీరామ్ అనిపింలనో లేక వినిపించాలనో దర్శకుడు దిగజారి మరీ చేసిన ట్రిక్ గా చెబుతున్నారు. ఇందులో ప్రభాస్ ప్రమేయం ఉంటుందనుకోలేం. అతను ఇలాంటి వివాదాలకు దూరంగానే ఉంటాడు. బట్ దర్శకుడు మాత్రం కాస్త అతిగాడే. ఆ విషయం ఆదిపురుష్ టీజర్ లాంచింగ్ టైమ్ లోనే తెలిసిపోయింది. చెప్పడానికి అక్షయ తృతియ సందర్భంగా విడుదల చేశాం అని చెబుతున్నారు. కానీ ఈ పండగ టైమ్ లో సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఎప్పుడూ పెద్దగా రాలేదు. అంతెందుకు ఆదిపురుష్ తప్ప మరో సినిమా కూడా కనిపించడం లేదు. అయినా కావాలని రెచ్చగొట్టడానికే చేశారా అంటే అవునని కూడా చెప్పలేం కానీ.. మరో కారణం కనిపిస్తోంది.


నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఏం చేసినా పెద్దగా బజ్ రావడం లేదు. ఎంత ప్రభాస్ హీరో అయినా ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా టీజర్ టైమ్ కే ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని పక్కన బెట్టారు. తమ లిస్ట్ లోనుంచి తీసేశారు. వారందరి దృష్టీ ఇప్పుడు కేవలం సలార్ పైనే ఉంది. దీంతో తన సినిమాకు హైప్ పెంచడానికే కావాలని ఇలా రంజాన్ రోజు రిలీజ్ చేశాడు ఓమ్ రౌత్ అనేది కొందరి వాదన. ఏదేమైనా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ వల్ల ప్రమోషన్స్ కంటే ఎక్కువ డ్యామేజ్ లే జరుగుతాయనేది నిజం.

Related Posts