అల్లరి నరేష్ అనగానే అతని ఇమేజ్ కళ్ల ముందు కనిపిస్తుంది. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ తరహాలో కామెడీ హీరోగా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. బట్ ఇవివి మరణం తర్వాత అతనికి కామెడీ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. అయితే అతన్లో గొప్ప నటుడు కూడా ఉన్నాడని.. కామెడీ హీరోగా చేస్తున్నప్పుడే పెళ్లయింది కానీ, గమ్యం, ప్రాణం, నేను వంటి సినిమాలతో నిరూపించుకున్నా.. వచ్చిన ఇమేజ్ ను మాత్రం వదల్లేదు. బట్ ఇప్పుడు కామెడీ సినిమాలకు దాదాపు కాలం చెల్లింది. పైగా ఆ తరహా కామెడీస్ అన్నీ టివిల్లోనే బోలెడు వస్తున్నాయి. అందుకే నరేష్ రూట్ మార్చి కొత్త ఇమేజ్ కు నాంది పలికాడు. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడిని నమ్మి చేసిన నాంది సినిమా అతనికి మంచి పేరు తెచ్చింది. సినిమా కమర్షియల్ గానూ హిట్ కొట్టింది. తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఒక్క ఫ్రేమ్ లో కూడా కామెడీ హీరో కనిపించకుండా చాలా సీరియస్ గా చేసిన నాందితో అతను ఏకంగా నాంది నరేష్ గా మారాడు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో ‘ఉగ్రం’అనే సినిమా వస్తోంది.

నాందిలో నరేష్ ను అమాయకంగా చూపించిన దర్శకుడు విజయ్ ఈ సారి చాలా వయొలెంట్ గా మార్చాడు. శివకుమార్ అనే సిన్సియర్, సీరియస్ పోలీస్ ఆఫసర్ గా నరేష్ కనిపిస్తున్నాడు. సిటీలో సడెన్ గా కొంతమంది అదృశ్యం అవుతుంటారు. వారిని పట్టుకునే క్రమంలో తన ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోతుంది. వారంతా ఏమైపోయారు..? ఈ కిడ్నాప్ లు చేస్తున్నది ఎవరు..? అనేది తెలుసుకునే పోలీస్ గా నరేష్ నటించాడు. విశేషం ఏంటంటే.. ఇందులోనూ తన పాత ఇమేజ్ తాలూకూ ఫ్రేమ్ ఒక్కటి కూడా లేదు. ఇంకా చెబితే రెగ్యులర్ మాస్ కమర్షియల్ హీరోల రేంజ్ లో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, బ్లడ్ షెడ్ కనిపిస్తోంది. ఏదైనా.. కథ బావుంటే ఇవన్నీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కేవలం ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నంలో చేస్తే దెబ్బైపోతుంది.బట్ దర్శకుడు నాందిలో న్యాయవ్యవస్థలోని ఓ సెక్షన్ గురించి చెప్పినట్టే.. ఇందులోనూ ఇండియాలో రోజూ మిస్ అవుతున్న వారి గురించి ఇన్ఫర్మేషన్ తో వస్తున్నట్టు కనిపిస్తున్నాడు. సో.. చూస్తోంటే ఈ హిట్ కాంబో మరో హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కాకపోతే నరేష్ మీద ఇంత వయొలెన్స్ వర్కవుట్ అవుతుందా అనేదే పెద్ద ప్రశ్న