రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్?

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌ లో డ్రగ్స్‌ తీసుకున్న కొందరు యువకులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రముఖ బీజేపీ నేత కుమారుడు ఇచ్చిన పార్టీలో నటీమణి లిషి గణేష్ తో పాటు తాజాగా ఈ కేసులో ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

రాడిసన్ హోటల్ కు డ్రగ్స్ సప్లయ్ చేసిన అబ్బాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. వారిలో విలక్షణ దర్శకుడు క్రిష్ పేరు కూడా ఉంది. రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు .

డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ స్టేట్ మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ లో డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారట పోలీసులు. అయితే.. ఆ పార్టీలో క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనేది విచారణలో తేలనున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు.. త్వరలోనే రిమాండ్ రిపోర్ట్ లో అన్ని విషయాలు వెల్లడించనున్నారు.

Related Posts