ఆశిష్ 3 టైటిల్.. ‘లవ్ మీ: ఇఫ్ యు డేర్’

దిల్ రాజు కాంపౌండ్ నుంచి హీరోగా అడుగుపెట్టాడు ఆశిష్ రెడ్డి. మొదటి సినిమా ‘రౌడీ బాయ్స్’తో నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న ఆశిష్.. భారీ విజయాన్నైతే దక్కించుకోలేకపోయాడు. ‘రౌడీ బాయ్స్’ తర్వాత ఇప్పటికే తన రెండో చిత్రం ‘సెల్ఫిష్’ చిత్రీకరణ దశలో ఉంది. రెండో సినిమా విడుదలకాకుండానే.. మూడో సినిమాని రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆశిష్ కి జోడీగా వైష్ణవి చైతన్య నటిస్తుంది. లేటెస్ట్ గా ఆశిష్ 3 కి టైటిల్ ఫిక్సయ్యింది. ఈ చిత్రానికి ‘లవ్ మీ: ఇఫ్ యు డేర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు.

ఘోస్ట్ లవ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. హారర్ ఎలిమెంట్స్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాని అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఎమ్.ఎమ్.కీరవాణి, పి.సి.శ్రీరామ్ వంటి లెజెండరీ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు దిల్ రాజు తెలిపారు.

Related Posts