దిల్ రాజు సమ్మర్ ప్లాన్ అదిరింది

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య సినిమాల స్పీడు తగ్గించాడు. గతంలో ఏడాదికి ఈజీగా మూడు, నాలుగు సినిమాలను విడుదల చేసేవాడు దిల్ రాజు. డిస్ట్రిబ్యూషన్ సంగతి పక్కన పెడితే.. 2017వ సంవత్సరంలో అయితే ఏకంగా ఏడు సినిమాలు దిల్ రాజు నిర్మాణంలో వచ్చాయి. అయితే.. మళ్లీ ఇప్పుడు దిల్ రాజు కాంపౌండ్ నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి.

ఈలిస్టులో ఈ వేసవి కానుకగా ఏప్రిల్ లో రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రణాళిక చేశాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఏప్రిల్ 5వ తారీఖున విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ రాబోతుంది. ‘గీత గోవిందం’ వైబ్స్ తో.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ పరశురామ్. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘ఫ్యామిలీ స్టార్’పై పాజిటివ్ బజ్ పెరిగింది.

ఏప్రిల్ లోనే దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ‘లవ్ మీ’ చిత్రం కూడా రాబోతుంది. ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాని హారర్ టచ్ తో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. సరికొత్త పాయింట్ తో ఎంటర్ టైన్ చేయడానికి ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీకి ఎమ్.ఎమ్.కీరవాణి, పి.సి.శ్రీరామ్ వంటి లెజెండరీ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. మొత్తంమీద.. నిర్మాతగా కాస్త గ్యాప్ తర్వాత దిల్ రాజు నుంచి రాబోతున్న ఈ రెండు సినిమాలు వేసవి బరిలో ఎలాంటి సందడిని తీసుకొస్తాయో చూడాలి.

Related Posts