పద్మవిభూషణ్ , మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ యుగంలో ఓ విప్లవాత్మక మార్పుకు నాంది పలికారు. తెలంగాణా రాష్ట్ర సమాచార, పౌరసరఫరాల శాఖా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి ఈ వేడుకలో చిరు పాల్గొన్నారు. తెలుగు డిజిటల్ ఫెడరేషన్ పేరిట కొత్త శకాన్ని ఆవిష్కరించారు. “వెబ్‌సైట్ రైటర్‌లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ట్విట్టర్ పర్సనాలిటీలు మరియు మెమె క్రియేటర్‌ల వంటి విభిన్న కంటెంట్ క్రియేటర్‌లను ఏకతాటిపైకి తెస్తుంది తెలుగు డిజిటల్ ఫెడరేషన్. సమాఖ్య వెబ్‌సైట్ ‘www.telugudmf.com’ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయగా… ఫెడరేషన్ లోగో మరియు స్వాగత పోస్టర్‌ను రాష్ట్ర మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. డిజిటల్ యుగంలో ఇన్‌స్పైర్ చేస్తున్న కంటెంట్ రైటర్స్ అందరినీ ఒక్కతాటికి తెచ్చేలా ఓ అసోసియేషన్ ఏర్పాటు చేయడం.. తెలుగు డిజిటల్ ఫెడరేషన్ అని పేరు పెట్టడాన్ని మెగాస్టార్ చిరు స్వాగతిస్తూ.. అభినందించారు. డిజిటల్ రైటర్స్ అందరూ ఒక మర్గదర్శకత్వంలో ఉండాలని..వారి వ్యక్తిగత, వైద్య ఆరోగ్య సదుపాయాల కల్పనలో ఈ ఫెడరేషన్ సహాయ సహకారాలు అందిస్తోందని తెలియజేసారు.
ఈ తెలుగు డిజిటల్ ఫెడరేషన్‌కి తెలంగాణా ప్రభుత్వ సహాయ సహకారాలు అనుక్షణం ఉంటాయని హామీ ఇచ్చారు మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.డిజిటల్ రంగంలో తెలుగు కంటెంట్ ను క్రియేట్ చేయడంలో విచ్చలవిడితనం, ఫేక్ న్యూస్ కు చెక్ పెడుతూ.. అథెంటిక్ న్యూస్‌ను అందించే విధంగా.. అదే క్రమంలో సృష్టించిన న్యూస్ పట్ల జవాబుదారీతనం తీసుకునేలా చేస్తుంది తెలుగు డిజిటల్ ఫెడరేషన్.
ఇది శక్తివంతమైన ఓ గ్రూప్ . ఇందులో ఎంతమంది క్రియేటివ్ పీపుల్ కలుస్తారు. సమిష్టిగా ఆలోచనలు , అనుభవాలు పంచుకుంటారు.. తెలుగు డిజిటల్ విభాగం ఉన్నతికి సమిష్టిగా పనిచేస్తారన్నారు నిర్వాహకులు. తెలుగుడిఎమ్ఎఫ్ సృష్టికర్తలందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తోంది. సభ్యత్వాలు మరియు ఇతర వివరాల కోసం, సంప్రదించండి: [email protected] శుభాకాంక్షలు, వ్యవస్థాపక సభ్యులు, తెలుగుడిఎంఎఫ్.