‘హనుమాన్’ నిర్మాత అప్ కమింగ్ మూవీస్

‘హనుమాన్’ చిత్రంతో ఎవరూ ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నిర్మాత నిరంజన్ రెడ్డి. ఇప్పటివరకూ సంక్రాంతి సీజన్లలో విడుదలైన చిత్రాలలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. అందుకు ప్రత్యేక కారణం ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవ్వడమే.

‘హనుమాన్’ థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘హనుమాన్’ హిందీ టెలివిజన్ ప్రీమియర్ ఈవారంలోనే ఉండబోతుంది. ఈ విషయాలను పక్కనపెడితే.. ఇప్పుడు ‘హనుమాన్’ నిర్మాత సైలెంట్ గా తన అప్ కమింగ్ మూవీస్ కి సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నాడట.

‘హనుమాన్’ తర్వాత సీక్వెల్ ‘జై హనుమాన్’ ఎలాగూ ఉంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ క్రేజీ సీక్వెల్ తో పాటు.. ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా ఓ కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నాడట నిరంజన్ రెడ్డి. ఈ చిత్రం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఓ మెగా హీరోతో మూవీని ప్లాన్ చేస్తున్నాడట. మొత్తంమీద.. ‘హనుమాన్’ నిర్మాత ప్లానింగ్ అయితే మామూలుగా లేదు.

Related Posts