దిల్ రాజు సాధించాడు..

తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC)ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. కొన్నాళ్లుగా చాంబర్ అధ్యక్షులుగా ఉండాలని దిల్ రాజు టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ సీనియర్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఉండటంతో పాటు రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలు ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి టైమ్ ఇవ్వలేము అనే కారణంతో ఈ ఎన్నికలపై సీరియస్ గా ఫోకస్ చేయలేదు. కానీ కొన్నాళ్లుగా సినిమా మారింది. సినిమా ఇండస్ట్రీలో సమస్యలూ మారాయి.

ఇవి ఎప్పుడోసినిమాలు తీసిన నిర్మాతలకు అర్థం కావడం లేదు. ఆ అంశాలపైనే ఫోకస్ చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీ ఫేస్ చేస్తోన్న ప్రాబ్లమ్స్ ను క్లియర్ గా చెబుతూ.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాం అని దిల్ రాజు ప్యానెల్ చేసిన ప్రచారం ఫలించింది. ఫైనల్ గా దిల్ రాజు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ఎక్కువ విజయం సాధించింది. ఈ క్రమంలో ఎవరెవరు ఏ సెక్టర్లో విజయం సాధించారు అనేది చూస్తే..
తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు.

ఫైనల్ రిజల్ట్

అధ్యక్ష పదవి కి పోటీపడుతున్న సి.కళ్యాణ్, దిల్ రాజు..

మొత్తం ఓట్లు – 48

మెజారిటీ మార్క్ – 25

ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)
దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5..

డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)
దిల్ రాజు కి 6, సి కళ్యాణ్ కి 6.

స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ (4)

దిల్ రాజు కి 3, సి కళ్యాణ్ కి 1.

ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16)
దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8.గా ఉన్న పరిస్థితి నుంచి మొత్తం 48 ఓట్ల లో దిల్ రాజుకి 31 ఓట్లు గెలుచుకుని చాంబర్ ప్రెసిడెంట్ అయ్యారు. మిగతా సెక్టార్స్ లో ప్రొడ్యూసర్ సెక్టర్ ఛైర్మన్ గా శివలంక కృష్ణ ప్రసాద్..డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ గా మిక్కిలినేని సుధాకర్..జాయింట్ సెక్రటరీ గా భరత్ చౌదరి గెలుపొందారు. తెలుగు ఫిలిం చాంబర్ వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్,ట్రెజేరర్ గా ప్రసన్న కుమార్ గా గెలుపొందారు.

Related Posts