Sai pallavi : సాయి పల్లవి టాలీవుడ్ కు గుడ్ బై చెప్పిందా..?

ఈ తరంలో వచ్చిన మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎవరూ అంటే మరో ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ చెప్పే ఏకైక పేరు సాయి పల్లవి. ఒకప్పటి సావిత్రి, సౌందర్యల తర్వాత ఆరేంజ్ లో మహిళాభిమానులను కూడా సంపాదించుకుంది. తను ఎంట్రీ ఇచ్చిన భాషల్లో ఫస్ట్ మూవీస్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేయడం విశేషం.

మళయాలంలో వచ్చిన ప్రేమమ్ చిత్రంలో చేసిన మలర్ పాత్రతోనే అక్కడి ప్రేక్షకులను కట్టి పడేసింది. తెలుగులో ఫిదా మూవీలో భానుమతిగా మనవాళ్లను ఫిదా చేసింది. తనకు మాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఎందుకో తెలుగు సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడ ఎమ్.సి.ఏ, పడిపడి లేచె మనసే, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం చిత్రాలు చేసింది. వీటి జయాపజయాలు పక్కన బెడితే.. ఈ మొత్తం సినిమాల్లో తన పాత్రే హైలెట్ గా నిలిచింది. తనకోసమే చూసినవాళ్లూ ఉన్నారు.

అయితే విరాటపర్వం పై సాయి పల్లవి చాలా హోప్స్ పెట్టుకుంది. బట్ ఈ చిత్రం విమర్శకులను మెప్పించినా.. కమర్షియల్ గా తేలిపోయింది. అప్పటి నుంచి తను ఇక తెలుగు సినిమా వైపు చూడలేదు. గతేడాది జూన్ 17న విడుదలైంది విరాటపర్వం. అంటే యేడాది అవుతోంది. ఈ యేడాదిలో తన వద్దకు చాలా కథలు వెళ్లాయి. చాలామంది దర్శకులూ వెళ్లారు బట్.. ఎందుకో మళ్లీ మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు తను.


మరి సాయి పల్లవి ఎందుకు తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే తను తెలుగును మాత్రమే కాదు.. ఇతర భాషల్లోనూ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. తెలుగువారి లాగానే.. తమిళ్ నుంచి కూడా తన వద్దకు చాలా ఆఫర్స్ వెళ్లాయి. చాలా ఆఫర్స్ ను రిజెక్ట్ చేసిన తర్వాత లేటెస్ట్ గా కోలీవుడ్ లో శివకార్తికేయన్ సరసన ఓ మూవీకి ఓకే చెప్పింది.

అంటే తను సినిమాల నుంచి తప్పుకోలేదు. మరి ఎందుకు తెలుగు సినిమాలను పూర్తిగా వదిలేసింది అనే డౌట్ అందరిలోనూ వినిపిస్తోంది. ఒకవేళ తనకు కథలు నచ్చలేదూ అనుకుందాం. కానీ తను ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటుందో అందరికీ తెలుసు కదా.. గ్లామర్ రోల్స్ అయితే నో చెబుతుందని అందరికీ తెలుసు. బలమైన హీరోయిన్ రోల్స్ ఉంటేనే తనను అప్రోచ్ అవుతారు ఎవరైనా. అయినా పట్టించుకోవడం లేదు అంటూ ఇక తను తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పేసినట్టేనా అనే డౌట్ అందరిలోనూ వినిస్తోంది. మరి ఇది నిజమా కాదా అనే కంటే నిజం కాకూడదు అనే కోరుకుందాం

Related Posts