Rana Daggubaati : దుల్కర్ హీరోగా రానా సినిమా

దగ్గుబాటి రానా.. సినిమా అంటే అతనికి ఎంత ప్యాషన్ అనేది అందరికీ తెలుసు. ఓ వైపు నటిస్తూనే కొత్తదనం ఉన్న సినిమాలను విపరీతంగా ఎంకరేజ్ చేస్తాడు. తన వద్దకు వచ్చిన మంచి కథలు వింటూ.. అవసరమైతే నిర్మాణం కూడా చేస్తాడు. బయటి చిత్రాలు ఏవైనా బాగా ఉండి.. తనకు నచ్చితే ఆ చిత్రాలను ప్రెజెంట్ చేస్తూ రిలీజ్ వరకూ ప్రమోషన్స్ చేస్తూ వారి టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంటాడు.

ఈవిషయంలో రానా తర్వాతే టాలీవుడ్ లో ఇంకెవరైనా.. అప్పుడెప్పుడో వచ్చిన కేరాఫ్‌ కంచరపాలెం అనే క్లాసిక్ మూవీ రానా లేకపోతే అంత సులువుగా బయటకు వచ్చేది కాదు.

పెళ్లి చూపులు కూడా అంతే. రానా ఇంటర్ఫీయర్ అయిన తర్వాతే దానికి మోక్షం వచ్చింది. అఫ్‌ కోర్స్ ఈవిషయంలో సురేష్‌ బాబు హ్యాండ్ కూడా ఉంటుందనుకోండి. ఇక లేటెస్ట్ గా కూడా రానా పరేషాన్ అనే సినిమాను ప్రెజెంట్ చేశాడు. బట్ ఈ చిత్రం ఆశించినంతగాఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. బట్ ఓ కొత్త కంటెంట్ ఉంది నమ్మిన రానా ప్రమోషన్స్ కూడా చేశాడు.

అలాంటి తను లేటెస్ట్ గా దుల్కర్ సాల్మన్ హీరోగా ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.
రీసెంట్ గా ఓ కొత్త కుర్రాడు చెప్పిన కథ విని రానా చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఈ కథలో దుల్కర్ అయితే బావుంటుందనిపించింది. మరి రానా తలచుకుంటే అప్పాయింట్ మెంట్స్ కు కొదవా..? వెంటనే ఈ కుర్రాడిని దుల్కర్ వద్దకు పంపించి కథ నెరేట్ చేయించాడు. దుల్కర్ ఫస్ట్ నెరేషన్ లోనే బాగా నచ్చింది. ఇంకేం.. తన అంగీకారం తెలిపాడు.

అలా ఈ సారి రానా నిర్మాతగా పూర్తి స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అదీ దుల్కర్ సాల్మన్ తో. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మాటలు ముగిశాయ