‘అయలాన్‘ విషయంలో మాట తప్పిన దిల్ రాజు?

ఈసారి సంక్రాంతికి సినిమాల రష్ ఎక్కువగా ఉండడంతో.. అన్నింటికీ థియేటర్లను సర్దుబాటు చేయడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందుకు వచ్చింది. ఈకోవలోనే రవితేజ ‘ఈగల్‘ చిత్రాన్ని సంక్రాంతి నుంచి వాయిదా వేశారు. దీంతో బరిలో మిగిలిన నాలుగు చిత్రాలను మూడు రోజుల్లో వచ్చేలా ప్లాన్ చేశారు. అంతే కాదు.. అదే ప్రెస్ మీట్ లో అనువాద సినిమాల సంగతేంటి? అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకనప్పుడు అనువాద చిత్రాల గురించి ఎందుకు అంటూ అడిగిన వారిపై ఫైర్ అయ్యారు దిల్ రాజు.

కట్ చేస్తే.. ఇప్పుడు సంక్రాంతి బరిలో తమిళం నుంచి అనువాద రూపంలో ‘అయలాన్‘ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 12న ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ ప్రెస్ నోట్ వదిలారు. అంతే కాదు.. ఈ సినిమాని తెలుగులో ఏ ఏ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారనే లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాని నైజాం, వైజాగ్ లలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మరెవరో కాదు.. దిల్ రాజుకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సీడెడ్ ఎన్.వి.ప్రసాద్, నెల్లూరు, గుంటూరు.. వి మూవీస్, కృష్ణ.. సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. మరి.. ‘అయలాన్‘ అనువాదం విషయంలో దిల్ రాజు ఏమంటారో చూడాలి.

Related Posts