మరో మాస్ సాంగ్ తో వచ్చిన ‘నా సామిరంగ‘

కింగ్ నాగార్జున ‘నా సామిరంగ‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సంక్రాంతి బరిలో సందడి చేయబోతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ‘దుమ్ము దుకాణం‘ అంటూ సాగే హై ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతంలో స్వరపరిచిన ఈ గీతంలో నాగార్జునతో పాటు.. హీరోయిన్ ఆషిక రంగనాథ్.. ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా సందడి చేస్తున్నారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లిరికల్ వీడియోని త్వరలో రిలీజ్ చేయనున్నారు.

జనవరి 14న ‘నా సామిరంగ‘ విడుదలకు ముస్తాబవుతోంది. ఈనేపథ్యంలో.. ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 10న ‘నా సామిరంగ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Related Posts