పుష్కర కాలం తర్వాత బాలీవుడ్ కి త్రిష! నయనతార మాటేంటి?

బాలీవుడ్ అనేది ప్రతీ హీరోయిన్ కి అల్టిమేట్ గోల్. అయితే.. సౌత్ నుంచి బీటౌన్ కి వెళ్లిన జయప్రద, శ్రీదేవి వంటి కొంతమంది తారలు అక్కడే సెటిలైపోతే.. విజయశాంతి, భానుప్రియ, రమ్యకృష్ణ, రంభ వంటి వారు ఐదారు సినిమాలు చేసి వెనక్కి వచ్చేశారు. ఇక.. 90లలో అగ్ర నాయికగా దక్షిణాదిన చక్రం తిప్పిన సౌందర్య బాలీవుడ్ లో ఒకే ఒక్క చిత్రం చేసింది. అది కూడా వెటరన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కావడం విశేషం. అమితాబ్ బచ్చన్ హీరోగా ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘సూర్యవంశం’ చిత్రంలో కథానాయికగా నటించింది సౌందర్య.

సౌందర్య తర్వాతి తరానికి చెందిన స్టార్ హీరోయిన్ త్రిష కూడా బాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా చేసింది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ‘కట్టా మీటా’ సినిమాలో కథానాయికగా చేసింది త్రిష. అయితే.. పుష్కర కాలం తర్వాత మళ్లీ బాలీవుడ్ లో సినిమా చేయడానికి రెడీ అవుతోందట త్రిష. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ‘ది బుల్’ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఓ.కె. చెప్పిందట. కరణ్ జోహార్ నిర్మాణంలో ‘పంజా’ ఫేమ్ విష్ణు వర్థన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ‘జవాన్’తో బాలీవుడ్ కి బడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నయనతార పెర్ఫామెన్స్ కి బీటౌన్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మరి.. నయన్ కూడా త్వరలోనే బాలీవుడ్ లో తన సెకండ్ మూవీపై హింట్ ఇస్తుందేమో చూడాలి.

Related Posts