కడప అంటే ఫ్యాక్షన్‌ అనుకున్నా.. కానీ.. – యాక్టర్‌ నరేన్ రామా

టాలీవుడ్‌లో రాబోతున్న కొత్త సినిమా ‘కలియుగంలో పట్టణంలో ‘ . రమాకాంత్ రెడ్డి కథ,స్క్రీన్‌ ప్లే ,డైలాగ్స్, డైరెక్షన్‌ అందిస్తున్న ఈ సినిమాకి డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మాతలు. ఈ సినిమాలో నరేన్‌ రామా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. నరేన్ రామా సీనియర్ యాక్టర్‌ గుమ్మడి బంధువు. తెలుగు వారైనా నరేన్ తల్లి తండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడ తమిళ పరిశ్రమలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పలు యాడ్స్, సినిమాలు చేసిన నరేన్ తమిళ్ లో మూడు సినిమాలు హీరోగా, ఒక సినిమాలో విలన్ గా చేశారు.. తెలుగులో కలియుగ పట్టణంలో సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసారు నరేన్ రామ.

తన వెల్‌ విషర్ సాయి ఈ చిత్రంలో ఛాన్స్ ఇప్పించినట్టు గా చెప్పారు నరేన్ రామా. హీరో విశ్వ కార్తికేయ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసాడు. హీరోగా చేస్తున్నాడు. నాకు వర్క్ విషయంలో చాలా హెల్ప్ చేసాడన్నారు నరేన్‌ రామా.

ఇది ఒక థ్రిల్లర్ మూవీ, అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. మార్చ్ 29 ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో సినిమాకు మంచి బజ్ వచ్చిందన్నారు.
ఈ సినిమా కోసం ఫస్ట్ టైమ్‌ కడపకు వెళ్లానన్నారు. కడప అంటే ఫ్యాక్షన్‌ అనుకున్నాను కానీ.. అక్కడ చాలా ప్రశాంతంగా ఉందన్నారు. ఈ మూవీ కడపలోనే మెజార్టీ భాగం షూటింగ్ జరిగినట్టు చెప్పారు నరేన్‌ రామా.

Related Posts