ధనుష్ మనిషా.. మెషినా..

ధనుష్ మనిషా.. మెషీనా.. ఇదే ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. లేదంటే ఎవరైనా ఎంత పనిచేస్తున్నారు అన్న విషయంలో కొంత వరకూ ఓ క్లారిటీతో ఉంటారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఒక హీరో తర్వాత చేయబోయే ఒకటి రెండు.. లేదూ మహా అయితే మూడు సినిమాలు అప్డేట్స్ ఏంటో తెలిసి ఉంటాయి. బట్ఒకేసారి ఐదారు సినిమాలు లైనప్ లో ఉండటం.. అవి కూడా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో చాలా వరకూ ఉండటం అంటే ధనుష్ ఎంత పని పిచ్చోడో అర్థం కావడం లేదూ.. పోనీ అతనేమైనా ఆషామాషీ కథలు చేస్తాడా అంటే లేదు. లార్జర్ దన్ లైఫ్ లాంటి స్టోరీస్ తో పాటు లైవ్ స్టోరీస్ లోనూ అద్భుతంగా నటించేస్తుంటాడు. ప్రస్తుతం అతని చేతిలో ఆరు సినిమాలున్నాయి. ఇవన్నీ మోస్ట్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం.


ధనుష్ కెరీర్ లో 50వ సినిమా చేస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ అనే టైటిల్ తో రాబోతోన్న ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ సినిమాకు దర్శకుడు కూడా అతనే. ఈ యేడాది డిసెంబర్ 15న కెప్టెన్ మిల్లర్ విడుదల కాబోతోంది. స్వాతంత్ర్యపూర్వం కథతో వస్తోన్న సినిమా ఇది.


ఈ మూవీ తర్వాత 51వ సినిమా మన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఉంటుంది. ఇది కూడా లార్జర్ దన్ లైఫ్ స్టోరీనే. సార్ తర్వాత అతను చేయబోతోన్న రెండో స్ట్రెయిట్ తెలుగు మూవీ. కానీ ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదలవుతుంది. ఈ మూవీతో పాటే హిందీలో తనను పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో రాంఝనాకు కొనసాగింపు లాంటి సినిమా వస్తుంది. ఈ మూవీ టైటిల్ తేరే ఇష్క్ మే.ఆ మధ్య విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్ చూస్తే ధనుష్ మరోసారి బాలీవుడ్ ను స్పెల్ బౌండ్ చేయబోతున్నాడు అనిపిస్తుంది.
ఇక కర్ణన్ సినిమాతో తనను ఫస్ట్ టైమ్ వంద కోట్ల క్లబ్ లో చేర్చిన దర్శకుడు మారి సెల్వరాజ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. మారి సెల్వరాజ్ లేటెస్ట్ గా మామన్నన్ అనే సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.ఈ చిత్రం తెలుగులో నాయకుడుగా డబ్అయింది.


మారి సెల్వరాజ్ తర్వాత కెప్టెన్ మిల్లర్ కు కథ అందించిన అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో సినిమా ఓకే అయింది. అంటే వరుసగా ఐదు సినిమాలు. వీటితో పాటు ఏ కాంబినేషన్ గురించి చెబితే కోలీవుడ్ లో అవార్డ్ లు కూడా ఆనంద పడతాయో ఆ కాంబో కూడా సెట్ అయింది. యస్.. ధనుష్ – వెట్రిమారన్ సినిమా కూడా ఫిక్స్ అయింది.యస్.. వెట్రీమారన్ .. ధనుష్ కాంబోలో వచ్చిన వడచెన్నైకి సీక్వెల్ గా మరో సినిమా వస్తోంది. వీరి కాంబోలో సినిమా అంటే కోలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం వెట్రీమారన్ విడుదలై2 సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత సూర్య హీరోగా వాడి వాసలై ఉంటుంది. ఈ లోగా ధనుష్ ఈ నాలుగు ప్రాజెక్ట్స్ ను ఫినిష్ చేసుకుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే.. ఈ చిత్రాల కథలన్నీ ఓకే చేసి ఉన్నాడు. అంటే ధనుష్ ఓకే అంటే ప్రీ ప్రొడక్షన్ నుంచి డైరెక్ట్ గా సెట్స్ పైకి వెళ్లే చిత్రాలే ఇవన్ని. మరి ఇన్ని సినిమాలు ఒకేసారి లైన్ లో పెట్టుకున్నాడు అంటే అతను మనిషా లేక మెషినా అనడం కరెక్టే కదా..

Related Posts