రజినీకాంత్ ద్రవిడ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడా

రజినీకాంత్.. ఎంత పెద్ద సినిమా స్టారో అంత పెద్ద భక్తుడు. భక్తి అనేది వ్యక్తిగతం.ఆ విషయంలో ఎవరికీ ఏ అభ్యంతరాలూ లేవు.అయితే సెలబ్రిటీస్ విషయంలో ఇది కాస్త ఎక్స్ ట్రీమ్ గా కనిపిస్తుంది.కొన్నిసార్లు ఇది అభిమానులు, ఆ ప్రాంత ఆత్మగౌరవంతోనూ ముడిపడి ఉంటుంది. ఇప్పటి వరకూ రజినీకాంత్ సినిమా తప్పితే బయట ఎప్పుడూ నార్మల్ గానే ఉన్నాడు. బయట నో మేకప్, నో విగ్. సాధారణంగా తన జీవితాన్ని గడిపేస్తుంటాడు. అలాంటి రజినీ ఉన్నట్టుండి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. తమిళనాడులో ఆయనపై చాలామంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


జైలర్ సూపర్ హిట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి ఉత్తరభారత ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నాడు రజినీకాంత్.తన చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ చూశాడు.ఈ సందర్భంగా రజినీకాంత్ వెళ్లి ఆయన కాళ్లకు మొక్కాడు. రజినీ వయసుతో పోలిస్తే యోగి చాలా చిన్నవాడు. వ్యక్తిత్వం పరంగా చూస్తే చట్ట ప్రకారం క్రిమినల్. అలాంటి వ్యక్తి కాళ్లకు రజినీకాంత్ దండం పెట్టడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ముఖ్యమంత్రి.. పోనీ వయసులో పెద్దవాడు అనుకుంటే ఏమో అనుకునేవాళ్లు. రజినీ వ్యక్తిత్వానికి ఏ మాత్రం సరిపోలని వ్యక్తి కాళ్లకు ఆయన మొక్కడం ఏంటని ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఒక వ్యక్తి మరో వ్యక్తి కాళ్లకు మొక్కడం ఏ రకంగా అయినా అది వారి పర్సనల్. కానీ ఇక్కడ యోగిఆద్యత నాథ్ పై అనేక విమర్శలున్నాయి. ఆయన పాలనపైనా..సామన్య ప్రజలపై అతని తీరుపైనా విమర్శలున్నాయి.కేవలం హిందువులకు ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఉంటాడు. అలాంటి వాడి కాళ్లకు మొక్కడం పెరియార్ వారసత్వాన్ని బలంగా నమ్మే తమిళీయన్ లు జీర్ణించుకోలేకపోతున్నారు. రజినీకాంత్ ద్రవిడ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడని.. అతను ఓ మరాఠా వాడు కాబట్టే మన ద్రవిడ గొప్పతనాన్ని ఒప్పుకోవడం లేదంటూ కొత్త చర్చనూ తెరపైకి తెస్తున్నారు. నిజానికి ఒకప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కాళ్లపైనా కొందరు పొలిటీషియన్స్ పడ్డారు. అది వారి అవసరం. అలాగే వారి సెల్ఫ్ రెస్పెక్ట్ లేమితనాన్ని సూచిస్తుంది. కానీ ఇక్కడ రజినీకాంత్ తన వ్యక్తిత్వాన్ని ఇంతలా దిగజార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిది. తను ఎంత బిజెపి మనిషి అయినా.. ఇలా ఓ క్రిమినల్ కాళ్లకు మొక్కాలా అనేది పెద్ద ప్రశ్నగా చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్ కూడా.


మొత్తంగా ఈ తతంగం జైలర్ విడుదలకు ముందు జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రభావం కనిపించేదే. ఎందుకంటే ఈ వ్యవహారంపై ఇప్పుడు తమిళనాడులో తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. రజినీకాంత్ గురించి సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అనేక చర్చలు సాగుతున్నాయి. ఏదేమైనా రజినీకాంత్ ఈ చర్యతో తన క్యారెక్టర్ ను తనే దిగజార్చుకున్నాడు అనేది నిజం అనేది మెజారిటీ జనాల అభిప్రాయం.

Related Posts