నాగార్జున కొత్త గలాటా

కొన్నాళ్లుగా సరైన హిట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అక్కినేని నాగార్జున. తన తరం హీరోల్లో హిట్టే లేని హీరో అతను మాత్రమే. మెగాస్టార్, బాలయ్య ఫామ్ లోనే ఉన్నారు. వెంకటేష్ తన ఇమేజ్ కు తగ్గట్టుగా అదరగొడుతున్నాడు. ఇటు చూస్తే నాగ్ ఇంకా మన్మథుడినే అనే భ్రమలో ఆగిపోయాడు. అదే అతని ఫ్లాపులకు కారణమైంది.

ఇక ఇప్పుడు వందో సినిమా అనే రేర్ మైల్ స్టోన్ కు దగ్గరలో ఉన్నాడు. ఈ మూవీకి ముందు వచ్చే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి ఉండాలని భీష్మించుకున్నాడు. అందుకే కథ విషయంలో ఓ పట్టాన ఓకే చేయడం లేదు. ఆ మధ్య రైటర్ ప్రసన్న కుమార్ కు దర్శకుడుగా అవకాశం ఇస్తున్నాడు అనే ప్రచారం జరిగింది. అది నిజం కూడా. కానీ ప్రసన్న కుమార్ చెప్పిన లైన్ నచ్చలేదు. దీంతో మళయాలంలో హిట్ అయిన ‘పోరింజు మరియం జోస్’ అనే మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. ఇది లోకల్ గ్యాంగ్ స్టర్ డ్రామా.

యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఆ కథ అచ్చంగా నాగ్ ఇమేజ్ కు సరిపోతుందా అంటే చెప్పలేం కానీ.. రీమేక్ అన్నప్పుడు మార్పులు ఉంటాయి కదా.. సో.. ఫైనల్ గా ఈ మూవీనే రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంతో మరో కొరియోగ్రాఫర్ ను దర్శకుడుగా పరిచయం చేస్తున్నాడు. గతంలో లారెన్స్ కు దర్శకుడుగా అవకావం ఇచ్చి ఎంకరేజ్ చేసింది నాగార్జుననే కదా. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ స్టూవర్ట్ బిన్నిని కూడా అలాగే ఇంటర్డ్యూస్ చేస్తున్నాడు.


ఇక ఈ చిత్రానికి ” గలాటా ” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఒరిజినల్ కథతో చూస్తే ఈ టైటిల్ వంద శాతం సూట్ అవుతుంది. ఈ సినిమా అలాంటి గలాటాల నేపథ్యంలోనే సాగుతుంది. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే అంటున్నారు. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే. ఆ సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ను కూడా విడుదల చేస్తారని టాక్. మొత్తం నాగ్ ఇన్నాళ్ల ఎదురుచూపుకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. అన్నట్టు ఇది నాగ్ కు 99వ సినిమా. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే 100వ సినిమా కోసం దర్శకుడు మోహన్ రాజా సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య తెలుగులో వస్తోన్న రీమేక్ సినిమాల రిజల్ట్స్ చూస్తుంటేనే కాస్త భయం వేస్తోంది కదా..

Related Posts