ఆ విషయంలో ‘బాహుబలి’కి బాప్ ‘దేవర’

‘ఆర్.ఆర్.ఆర్’తో గ్లోబల్ స్టార్ గా అవతరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అంతకు మించి అన్నట్టుగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్నాడు. ఈ లిస్టులో ముందుగా వచ్చే చిత్రం ‘దేవర’. ఇప్పటికే తారక్ కి ‘జనతాగ్యారేజ్’ వంటి మెమరబుల్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాత్రలో కాదు.. ద్విపాత్రాభినయంతో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడట. తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో అలరించనున్నాడట.

ఎన్టీఆర్ డబుల్ రోల్స్, ట్రిపుల్ రోల్స్ కొత్తేమీ కాదు. అలాగే.. తండ్రీకొడుకులుగానూ డ్యూయెల్ రోల్స్ లో మురిపించిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. కానీ.. ఈ సినిమాకోసం ‘బాహుబలి‘ తరహా ఫార్ములాని ఫాలో అవుతున్నాడట కొరటాల శివ. ఎన్టీఆర్ రెండు పాత్రల్లోనూ యంగ్ లుక్ తోనే మురిపించనున్నాడట.

అలాగే.. ముందుగా మొదటి భాగంలో కొడుకు పాత్రను చూపించి.. ఆ తర్వాత తండ్రి పాత్రను అంతకు మించి అన్న రీతిలో ఎలివేషన్స్ తో ఇంట్రడ్యూస్ చేస్తాడట. కంటెంట్ పరంగా ‘బాహుబలి’కి మించిన రీతిలో అన్నట్టు ‘దేవర’లో ఎన్టీఆర్ పోషించే రెండు క్యారెక్టర్స్ హైలైట్ అవుతాయనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకున్న ‘దేవర’ త్వరలో గోవాలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకోనుందట.

Related Posts