టాలీవుడ్

దేవర.. ఒక పెద్ద పనైపోయింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా దేవర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 2024 ఏప్రిల్ 5న విడుదల అనే టార్గెట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ ఆ టార్గెట్ ను ఛేదించేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతోంది.

ఫస్ట్ షెడ్యూల్ నే ఏ మాత్రం తేడా లేకుండా ముగించుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా మరో భారీ షెడ్యూల్ ను పూర్త చేసుకుంది. ఇది ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ చేసిన అతి పెద్ద షెడ్యూల్స్ లో ఒకటి అని చెబుతున్నారు. అంటే అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ కంటే కూడా పెద్ద షెడ్యూల్ అంటున్నారు. ఈ షెడ్యూల్ లోనేఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట.


శంషాబాద్ సమీపంలో వేసిన అతి పెద్ద సెట్ లో ఈ సీన్స్ షూట్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సెట్ లోనే సముద్రంకు సంబంధించిన సన్నివేశాలున్నాయి. అంటే బ్లూ/ గ్రీన్ మ్యాట్ లో చేసినవి. దేవర సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని ముందే చెప్పారు కదా..? ఆ బ్యాక్ డ్రాప్ లో అంటే సముద్రంలోనే చిత్రీకరణ చేయడం అసాధ్యం అవుతుంది.

ఏదో పాటలంటే ఓకే కానీ ఫైట్స్, యాక్షన్స్ సీన్స్ అంటే కష్టమైపోతుంది. పైగా ఈ పార్ట్ లో పోటెత్తుతున్న సముద్ర కెరటాల నడుమ ఓ పెద్ద ఫైట్ షూట్ చేసినట్టు టాక్. మొత్తంగా ఈ షెడ్యూల్ తో ఓ పెద్ద పనైపోయిందని దేవర మూవీ టీమ్ హ్యాపీగా ఫీలవుతున్నారట.

Telugu 70mm

Recent Posts

పాటల పండగ మొదలెడుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్‘

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను.. ఉస్తాద్ హీరోగా మార్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. అంతకుముందు వరుస ఫ్లాపులతో సతమతమైన డాషింగ్ డైరెక్టర్…

12 hours ago

ఓటీటీ లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ‘

చాలా కాలం తర్వాత ఓ అనువాద సినిమా తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అదే.. ‘మహారాజ‘. విలక్షణ నటుడు, కోలీవుడ్…

13 hours ago

‘కల్కి‘ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD‘ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా…

14 hours ago

Krithi Shetty

15 hours ago

ఓటీటీ లోకి వచ్చేసిన కాజల్ ‘సత్యభామ‘

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ‘. 'గూఢచారి, మేజర్' వంటి మూవీస్…

16 hours ago