పబ్లిసిటీ స్టంట్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన ప్రియదర్శి

ఒకవైపు కమెయడిన్ గా అగ్రపథాన దూసుకెళ్తూనే.. మరోవైపు కథానాయకుడిగానూ ప్రత్యేకమైన పాత్రలతో తన విలక్షణతను చాటుకుంటున్నాడు ప్రియదర్శి. లేటెస్ట్ గా ప్రియదర్శి హీరోగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ‘డార్లింగ్‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసమే గత రెండు రోజులుగా ప్రియదర్శి, నభా నటేష్ మధ్య ట్వీట్ వార్ జరిగినట్టు జోరుగా ప్రచారం జరిగింది.

‘హనుమాన్‘ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. తాజాగా.. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పవన్, మహేష్, ప్రభాస్ సినిమాల రిఫరెన్సెస్ వాడుతూ ఆసక్తికరంగా తీర్చిదిద్దిన ‘డార్లింగ్‘ మూవీ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.

Related Posts