HomeMoviesటాలీవుడ్‘రత్నం‘ నుంచి రొమాంటిక్ మెలోడీగా ‘ప్రాణం నా ప్రాణం‘

‘రత్నం‘ నుంచి రొమాంటిక్ మెలోడీగా ‘ప్రాణం నా ప్రాణం‘

-

యాక్షన్ స్టార్ విశాల్ పేరుకు తెలుగు వాడే అయినా.. తమిళంలో పెద్ద మార్కెట్ ఉన్న నటుడు. అందుకే.. కోలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్స్ గా దూసుకెళ్తున్నాడు. ఇక.. విశాల్ గత చిత్రం ‘మార్క్ ఆంటోని‘ తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేకపోయింది. కానీ.. తమిళంలో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘రత్నం‘ సినిమాతో అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఏప్రిల్ 26న విడుదలకు ముస్తాబవుతోన్న ‘రత్నం‘ సినిమా ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ‘ప్రాణం నా ప్రాణం‘ అంటూ సాగే గీతం విడుదలైంది. విరించి పుట్ల రాసిన ఈ గీతాన్ని కపిల్ కపిలన్, రెనైనా రెడ్డి ఆలపించారు. విశాల్, ప్రియా భవానీ శంకర్ మధ్య చిత్రీకరించిన ఈ పాట మెలోడీయస్ గా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విశాల్ కి ‘భరణి, పూజ‘ వంటి విజయాలందించిన హరి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

ఇవీ చదవండి

English News