తమన్నాకు ఇక హద్దే లేదు

రెండు దశాబ్దాల క్రితం తెలుగు తెరకు పరిచయం అయింది తమన్నా. అప్పటికి తను టీనేజర్. తెలుగులో లక్ కలిసి రాలేదు. కోలీవుడ్ కు వెళ్లి హిట్స్ కొట్టింది. ఆ క్రేజ్ తో మళ్లీ టాలీవుడ్ లో పాగా వేసి టాప్ హీరోయిన్ అనిపించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా తమన్నా క్రేజ్ తగ్గలేదు.

వరుసగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా ప్రేమలో పడి ప్రియుడిని కూడా పరిచయం చేసింది. అయితే అనూహ్యంగా అంతకు ముందే జీ కర్దా అనే వెబ్ సిరీస్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఇప్పటి వరకూ సౌత్ ఆడియన్స్ కు తమన్నా స్కిన్ షో గురించి తెలుసు. ఈ సిరీస్ లో ఇంటిమేట్ సీన్స్ తో షాక్ ఇచ్చింది. పైగా పచ్చి బూతులున్న డైలాగ్స్ చెప్పింది.

వాటికి తనే డబ్బింగ్ కూడా చెప్పడంతో ఇక్కడి ప్రేక్షకులు ఓ రకంగా తేరుకోలేకపోయారు అనే చెప్పాలి. అదే టైమ్ లో అమ్మడిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శలను లెక్క చేయకపోగా.. మళ్లీ నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ 2లో నటించింది.

పెళ్లైనా.. అంతకు ముందే ప్రేమించిన వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్న మహిళ పాత్రలో మరోసారి అందాలారబోస్తూనే రెచ్చిపోయింది. ఇక ఈ రెండు సిరీస్ ల తర్వాత తమన్నాకు కొత్త ఫ్యాన్స్ వచ్చారు. కొంతమంది పాత ఫ్యాన్స్ వదిలేశారు. బట్.. ఎవరు ఉన్నా లేకపోయినా.. వీటి వల్ల అమ్మడికి చాలా పెద్ద హెల్పే అయింది.


తనపై వచ్చిన.. వస్తోన్న విమర్శలను అస్సలే మాత్రం పట్టించుకోకుండా.. తమన్నా తాజాగా మరో రెండు వెబ్ సిరీస్ లకు సైన్ చేసింది. మరి వెబ్ సిరీస్ అంటే చెప్పేదేముందీ.. మళ్లీ అదే తరహాలో స్కిన్ షో.. ఇంటిమేట్ సీన్స్.. సో.. ఇక తమన్నా మరో ఇన్నింగ్స్ లో హద్దే ఉండదేమో.. ఏదేమైనా మిల్కీ బ్యూటీ తెలివైందే. ఇంకా సినిమాలే అని కూర్చుంటే.. కష్టం అని ఊహించే ఇలా.. ఊ అంటాను మావా తరహా పాత్రలకు ఓకే చెబుతోంది.