కెప్టెన్ మిల్లర్ .. ప్యాన్ ఇండియన్ టీజర్

టాలెంటెడ్ స్టార్ ధనుష్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మనోడి టాలెంట్ కు ఫిదా కాని వారు లేరు. ఎంచుకునే కథల్లోనే ఓ వైవిధ్యం కనిపిస్తుంది. కోలీవుడ్ లోని ఇతర స్టార్ హీరోస్ లాగా ఒక పర్టిక్యులర్ ఇమేజ్ కే కట్టుబడకుండా ఏ తరహా కథైనా ఓకే అంటూ దూసుకుపోతున్నారు. తన కటౌట్ తో పనిలేకుడా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు ధనుష్. అది మాస్ అయినా.. క్లాస్ అయినా. అదే అతని స్పెషాలిటీ.

అతని స్క్రీన్ ప్రెజెన్స్ కే ఓ స్పెషల్ ఆరా ఉంటుందంటారు.. అతనితో పనిచేసే దర్శకులు. ఇక ఇప్పుడు ‘కెప్టెన్ మిల్లర్’ గా రాబోతున్నాడు. అతని బర్త్ డే సందర్భంగా కెప్టెన్ మిల్లర్ టీజర్ విడుదల చేశారు. బర్త్ డే కాబట్టి అన్ని కట్స్ అతనిపైనే కాకుండా సినిమా కెపాసిటీని కూడా ఎలివేట్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు మేకర్స్.

టీజర్ ఆరంభంలోనే ఓ పోలీస్ నోటీస్ ఉంటుంది. దానిపై “పోలిస్ నోటీస్.. వాంటెడ్.. మర్డర్, డెకాయిట్, రివార్డ్ 10,000” అని ఉంటుంది. అతనే మిల్లర్. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథలా ఉంది.తెల్లవారితో పనిచేసి వారితో విభేదించి స్వాతంత్ర్యం కోసం నడుం కట్టిన ఓ యువకుడి పాత్రనే ధనుష్ చేస్తున్నట్టుగా ఉంది. అందుకే కెప్టెన్ మిల్లర్ అంటున్నారు.ఈ టీజర్ లో ఆశ్చర్యపరిచిన అంశాలు మూడున్నాయి.

హీరోయిన్ ప్రియాంక అరళ్ మోహనన్.. తను కూడా మిల్లర్ తో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే పాత్రలా ఉంది. చేతిలో తుపాకులున్నాయి. కాలుస్తుంది కూడా. రెండోది.. సందీప్ కిషన్. అతను ఉన్నాడు అని అందరికీ తెలుసు. బట్ ఓ పవర్ ఫుల్ రోల్ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక మూడోది హైలెట్ ఒన్.. కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్. అతను ఈ పోరాటంలో మిల్లర్ కు మద్ధతు ఇచ్చే వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇలా బర్త్ డే టీజర్ లో ఇవన్నీ కనిపించడం అరుదు. అందుకే కెప్టెన్ మిల్లర్ టీజర్ వెరీ ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి.


ఇక మేకింగ్ పరంగా మెస్మరైజ్ చేస్తుంది. ఆ కాలపు వాతావరణాన్ని రీ క్రియేట్ చేశారా అనిపిస్తుంది. షాట్స్ బావున్నాయి.కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన సానికాయిదమ్ సినిమా దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం చేశాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేస్తన్నట్టు ప్రకటించారు. ఈ డేట్ కీ ఓ సమస్య అదేంటో తర్వాతి ఆర్టికల్ లో చూద్దాం.

Related Posts