రివ్యూ : పవన్ కళ్యాణ్, సాయితేజ్, కేతిక శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, వెన్నెల కిశోర్ తదితరులు
ఎడిటింగ్ : నవీన్ నూలి
సంగీతం : తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసుదేవ్
స్క్రీన్ ప్లే,డైలాగ్స్ : విక్రమ్
నిర్మాతలు : టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
కథ, దర్శకత్వం : సముద్రఖని
రిలీజింగ్ : 28.07.2023

రీమేక్ లు చేయాలంటే పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా అనేలా మారాడు. కొన్నాళ్లుగా అన్నీ రీమేక్ లే. అలా వచ్చిందే ఈ బ్రో కూడా. తమిళ్ లో సముద్రఖని డైరెక్ట్ చేసిన వినోదాయ సీతాకు రీమేక్ గా వచ్చిన సినిమా. అయితే తెలుగుకు వచ్చేసరికి మొత్తం మారిపోయింది. అక్కడ సీరియస్ గా సాగే ఈ సినిమా ఇక్కడ మాత్రం ఎంటర్టైనింగ్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు సాయితేజ్ కూడా ఉన్నాడు కాబట్టి మెగా ఫ్యాన్స్ లో ఓ జోష్ వచ్చింది. బట్ కంటిన్యూస్ గా రీమేక్ లే కావడంతో గతంలో ఉన్నంత హైప్ లేదు అనే చెప్పాలి.బట్ రిలీజ్ టైమ్ కు బజ్ వచ్చింది. మరి ఈ రోజు విడుదలైన బ్రో స్ ఎలా ఉన్నారో చూద్దాం..

కథ :
ఎప్పుడూ బిజీగా ఉంటూ.. పని తప్ప వేరే ధ్యాస లేని వ్యక్తి మార్కండేయులు అలియస్ మార్క్ (సాయితేజ్). అతను టైమ్ ను మాత్రమే నమ్ముతాడు. మనుషులు, కుటుంబం, అనుబంధాలు ఇవేం పట్టించుకోడు. ఈ విషయంలో కుటుంబం అతన్ని మిస్ అవుతున్నా డోంట్ కేర్ అంటూ కాలంతో పరుగులు తీస్తుంటాడు. అలాంటి వ్యక్తి ఓ రోజు యాక్సిడెంట్ కు గురై చనిపోతాడు. తర్వాత అతను కాల దేవుడు టైటాన్(పవన్ కళ్యాణ్‌) ను కలుస్తాడు. జీవితంలో ఏమీ చూడలేదు అంటూ వేడుకుంటాడు. దీంతో టైటాన్ అతనికి రెండో అవకాశం ఇస్తాడు. ఓ 90 రోజుల్లోగా తన జీవితాన్ని సరిదిద్దుకోమంటాడు. మరి మార్క్ జీవితంలో ఈ 90రోజుల్లో వచ్చిన మార్పులేంటీ..? అతని జీవితం ఏ మలుపులు తిరిగింది అనేది మిగతా కథ.

విశ్లేషణ :
దర్శకుడు సముద్రఖని ఈ కథ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన జీవిత సత్యం అన్నాడు. బట్ ఈ తరహా సెకండ్ ఛాన్స్ కథలు మనకు చాలానే వచ్చాయి. హాలీవుడ్ లో అయితే 80ల్లోనే వచ్చాయి. తెలుగులో సైతం కొన్ని సినిమాలున్నాయి. మనిషి తన జీవితంలో చేసిన తప్పులను రిపీట్ కాకుండా చూసుకునే అవకాశం ఇవ్వడానికి తెలుగులో యముడు రెండో ఛాన్స్ ఇచ్చాడు. మన హీరోలు మాస్ కాబట్టి అలాగే వాడుకున్నారు. సముద్రఖని అది దాటి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ మొదటి పావుగంట కాస్త సాగదీతగా ఉంటుంది. ఎలివేషన్స్ ఎక్కువైపోవడంతో అక్కడక్కడా ప్రేక్షకులు ఇబ్బంది పడతారు కూడా. ఫ్యామిలీని పరిచయం చేయడానికి వారి పాత్రలను రిజిస్టర్ చేయడానికి కాస్త ఎక్కువ టైమే పట్టింది.అలాగే ఇంటర్వెల్ వరకూ తీసుకువచ్చాడు. అసలే వీక్ నెరేషన్ అంటే మధ్యలో వచ్చే పాటలు మరింత డిస్ట్రబ్ చేస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో పవన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కథలో వేగం వస్తుంది. కథనంలో జోష్ కూడా మొదలవుతుంది.
పవన్ కళ్యాణ్ ను వింటేజ్ రేంజ్ లో ప్రెజెంట్ చేశాడు త్రివిక్రమ్. అతని పాటలకు అతనే డ్యాన్సులు చేయడం.. కామెంట్స్ చేయడం వంటివి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కు కూడా బలే అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత ఒన్ మేన్ షోలా మారింది సినిమా. ఈ క్రమంలో సముద్రఖని చాలా సీరియస్ గా చెప్పిన అంశాలన్నీ లైటర్ వేలో సాగుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. అఫ్ కోర్స్ వినోదంతో పాటు తను చెప్పాలనుకున్న ‘విషయాన్ని’ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు సముద్రఖని. ఇంత వరకూ బానే ఉన్నా.. ఎందుకో నెరేషన్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది అనిపిస్తుంది.


ముఖ్యంగా మొదటి సగంలో.
అసలు పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్షన్ సరిగా కుదర్లేదు. అనుబంధాల్లో గాఢత లేనప్పుడు వారి ఎడబాటు వల్ల కలిగే ఆవేదన ఆడియన్స్ కు కూడా కనెక్ట్ కాదు. ఈ సినిమాలోనూ ఇదే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ స్వాగ్ వల్ల చాలా సీన్స్ పాసైపోతాయి. కొన్నిసార్లు ఊహించగలిగేలానే ఉన్నా.. ఎంటర్టైన్మెంట్ కు లోటు లేకపోవడంతో ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకూ అలా సాగిపోయినా చివరి పది నిమిషాలు మాత్రం ఎమోషనల్ గా మెప్పిస్తుంది.ఈ సినిమాకు ఇదే ఆయువు పట్టు. బట్ అది ఊహించగలిగేలా ఉండటమే కొంత సమస్య అవుతుందేమో.


ఇక నటన పరంగా పవన్ కళ్యాణ్ ను ఇలా చూసి చాలాకాలం అయింది. వింటేజ్ పవన్ ను గుర్తుకు తెచ్చాడు. అతని పాత్రంతా అల్లరిగానే ఉంటుంది. తను కూడా ఈ పాత్రను బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది.అందుకే చాలా ఈజ్ తో చేసుకుంటూ పోయాడు. ఓ రకంగా ఇది ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ ట్రీట్ అనే చెప్పాలి. సాయితేజ్ మార్కండేయులు పాత్రలో ఒదిగిపోయాడు. అతనితో పాటు ఉన్న పాత్రలతో అతని రిలేషన్ కంటే టైమ్ కే వాల్యూ ఇచ్చే వ్యక్తిగా బాగా చేశాడు. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, రోహిణి రోల్స్ ఓకే. కేతిక పాటలకే పరిమితం. ప్రియా ప్రకాష్ వారియర్ చెల్లిగా సెట్ కాలేదు.

టెక్నికల్ గా పాటలు మైనస్. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్ ఎఫెక్ట్స్ కొంత నాసిరకంగా కనిపిస్తాయి. డైలాగ్స్ బావున్నాయి. స్క్రీన్ ప్లే వీక్ గా ఉంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ బావున్నాయి. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త షార్ప్ చేయొచ్చేమో అనిపిస్తుంది. దర్శకుడుగా సముద్రఖని చెప్పాలనుకున్న పాయింట్ బావుంది. బట్ దాన్ని అతని ఊహలకు తగ్గట్టుగా చెప్పడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. నిజానికి ఇది అతను చెప్పినట్టుగా దేశంలోని ప్రజలంతా తెలుసుకోవాల్సినంత గొప్ప పాయింట్ అయితే కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

ప్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్
సాయితేజ్
సెకండ్ హాఫ్
క్లైమాక్స్
డైలాగ్స్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ 30 నిమిషాలు
సంగీతం
ఎడిటింగ్

ఫైనల్ గా : ఓకే బ్రో ..

రేటింగ్ : 2.75/5

                                    - బాబురావు. కామళ్ల

Related Posts