‘పుష్ప 2‘కి బ్రేక్ ఇవ్వనున్న బన్నీ.. కారణం?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రైజ్’ ఏ రేంజ్ లో హిట్టయిందో అందరికీ తెలిసిందే. పుష్పరాజ్ గా అదరగొట్టిన అల్లు అర్జున్ ను నేషనల్ అవార్డ్ వరించింది. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ‘పుష్ప : ది రూల్’పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫస్ట్ పార్ట్ ను తలదన్నే రీతిలో సెకండ్ పార్ట్ ను మలచడంపై పూర్తిగా దృష్టి పెట్టాడు సుకుమార్. పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘పుష్ప 2‘ షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. అల్లు అర్జున్, రష్మిక కలయికలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడట సుకుమార్.

కంటిన్యూస్ గా ‘పుష్ప 2‘ షూట్ లో పాల్గొంటోన్న బన్నీ.. వచ్చే వారం మాత్రం రెండు రోజుల పాటు షూట్ కి బ్రేక్ ఇవ్వనున్నాడట. అందుకు ప్రధాన కారణం నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళుతుండడమే. అక్టోబర్ 17న నేషనల్ అవార్డ్స్ ప్రదానోత్సవం జరగనుందట.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ‘పుష్ప 2‘ని నిర్మిస్తుంది. ఫస్ట్ పార్ట్ కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్.. అంతకుమించి అన్నట్టుగా సెకండ్ పార్ట్ మ్యూజిక్ ను తీర్చిదిద్దుతున్నాడట. ఫస్ట్ పార్ట్ లో నటించిన నటీనటులు సెకండ్ పార్ట్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. వచ్చే యేడాది ఆగస్టు 15న ‘పుష్ప 2‘ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts