‘ఫ్యామిలీ స్టార్‘ నుంచి గ్లింప్స్ రాబోతుంది

రాబోయే సంక్రాంతికి సినిమాల సందడి మామూలుగా లేదు. మహేష్ బాబు ‘గుంటూరు కారం‘, నాగార్జున ‘నా సామి రంగ‘, వెంకటేష్ ‘సైంధవ్‘, రవితేజ ‘ఈగల్‘, తేజ సజ్జ ‘హనుమాన్‘ వంటి సినిమాలు విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి. వీటితో పాటు సంక్రాంతినే టార్గెట్ చేసుకున్న మరో మూవీ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‘.

‘గీత గోవిందం‘ వంటి భారీ విజయం తర్వాత విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. ఇప్పటికే సంక్రాంతి బరిలో పలు సూపర్ హిట్స్ అందుకున్న దిల్ రాజు.. ‘ఫ్యామిలీ స్టార్‘ను పక్కాగా సంక్రాంతి బరిలో నిలపడానికి ప్రయత్నాలు ప్రారంభించాడట. ఇప్పటికే ఈ విషయాన్ని బయ్యర్లకు కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ గా ‘ఫ్యామిలీ స్టార్‘ మూవీ నుంచి రిలీజ్ డేట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అక్టోబర్ 18న ఈ గ్లింప్స్ విడుదలకానుందట. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. మరోవైపు ‘ఫ్యామిలీ స్టార్‘ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సరిగమ సినిమాస్ దక్కించుకుంది. ‘గీత గోవిందం‘ సినిమా ఓవర్సీస్ లో రెండు మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈనేపథ్యంలోనే ‘ఫ్యామిలీ స్టార్‘ ఓవర్సీస్ రైట్స్ కి ఫ్యాన్సీ రేటు లభించిందట.

Related Posts