మెగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తోన్న బుచ్చిబాబు

ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‘ సినిమాతో బిజీగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ‘ఉప్పెన‘ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఆర్.సి. 16‘ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ‘రంగస్థలం‘ తరహాలోనే పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందబోతుంది. దీంతో.. గతంలో ‘రంగస్థలం‘ కోసం వేసిన విలేజ్ సెట్ ప్లేసులోనే.. ఈ సినిమాకోసం ఓ ప్రత్యేకమైన సెట్ ను రూపొందిస్తున్నారట.

మార్చి మొదటి వారంలో ఈ సినిమా ముహూర్తాన్ని జరిపి షూటింగ్ మొదలుపెట్టనున్నారట. కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసి.. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్, టైటిల్స్ ను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొత్తంగా.. ‘రంగస్థలం‘ తర్వాత మరోసారి రామ్ చరణ్ లోని నటుడిని ఆవిష్కరించేదిగా ఈ సినిమాని తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట బుచ్చిబాబు.

Related Posts