పవన్ కళ్యాణ్, సాయితేజ్ కలిసి నటించిన సినిమా బ్రో. సముద్రఖని తమిళ్ లో రూపొందించిన వినోదాయ సీతమ్ కు రీమేక్ గా రూపొంది ఈ చిత్రానికి తెలుగులో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను త్రివిక్రమ్ అందించాడు. విడుదలకు ముందు మేకర్స్ ఊహించినంత గొప్ప బజ్ అయితే రాలేదు. ఆల్రెడీ తెలిసిన కథ కావడం.. పవన్ కళ్యాణ్ పాత్ర కృతకంగా ఉండటంతో ఆయన ఎంత జోష్ గా యాక్ట్ చేసినా ఫ్యాన్స్ కు తప్ప ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాలేదు.
అందుకే కలెక్షన్స్ లోనే కాదు.. ఓపెనింగ్ లో కూడా డల్ అనిపించుకుంది బ్రో. ఇలాంటి యూనిక్ పాయింట్ గురించి ప్రజలకు తెలియాలని సముద్రఖని అన్ని ప్రమోషనన్స్ లో ఊదరగొట్టినా.. ఇదేమంత గొప్ప పాయింట్ కాదనీ.. ఇప్పటికే కొన్ని సినిమాల్లో చూసిందే అంటూ ప్రేక్షకులు తీర్పునిచ్చారు. దీనికి తోడు పొలిటికల్ వివాదాలు కూడా బ్రోను దెబ్బకొట్టాయి. ఓవరాల్ గా నిర్మాతలు ఈ చిత్రంతో భారీగా నష్టపోయారు అనేది నిజం.
మొత్తంగా థియేటర్స్ లో పెద్ద విజయం సాధించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలోకి రాబోతోంది. ఈ నెల 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. మామూలుగా థియేటర్స్ లో ఫెయిల్ అయిన సినిమాలు ఓటిటిలో ఆకట్టుకోవడం చూస్తున్నాం. అలా ఈ బ్రో కూడా ఓటిటి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.